స్వీటెస్ట్ మెసేజ్: ధావన్-ఆయేషా వివాహానికి ఆరేళ్లు (ఫోటోలు)

హైదరాబాద్: అభిమానులతో సోషల్ మీడియాలో నిత్యం టచ్‌లో ఉండే క్రెకటర్లలో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ఒకడు. అనతికాలంలోనే భారత క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. భారత జట్టులో ఓపెనర్‌గా కొనసాగుతున్న ధావన్ లవ్ స్టోరీ గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
తనకంటే వయసులో పెద్దది అయినా ఆయేషాను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా శిఖర్ ధావన్, ఆయేషాల వివాహ బంధానికి ఆరేళ్లు పూర్తయ్యాయి. దాదాపు ఐదేళ్ల పాటు ప్రేమించుకున్న వీరిద్దరూ ఆరేళ్ల క్రితం వివాహ బంధంతో ఒక్కటయ్యారు. తమకు పెళ్లై ఆరేళ్ల పూర్తయిన సందర్భంగా ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను వ్యక్త పరుచుకుంటూ ఇనిస్టాగ్రామ్‌లో పోస్టులు పెట్టారు
ధావన్ కంటే ఆయేషా వయసులో పదేళ్లు పెద్దది
శిఖర్ ధావన్ కంటే ఆయేషా వయసులో పదేళ్లు పెద్దది. ఆయేషాకు గతంలోనే పెళ్లై ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. ఇవన్నీ తెలిసినప్పటికీ ప్రేమించిన ధావన్ పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాడు. ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన ఆయేషాతో 2009లోనే ధావన్‌కు ఎంగేజ్‌మెంట్ అయింది.
2012లో ఆయేషాతో ధావన్ వివాహం
2012లో వీరికి పెళ్లి జరిగింది. ఆయేషా రాకతో ధావన్‌కు అదృష్టం కలిసొచ్చింది. ఆయేషాతో పెళ్లి అయిన తర్వాతే 2013లో తొలిసారిగా భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచ్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ధావన్ తొలి మ్యాచ్‌లోనే సెంచరీ నమోదు చేశాడు.
భారత జట్టులో కీలక ఆటగాడిగా
శిఖర్ ధావన్ భారత జట్టులో కీలక ఆటగాడిగా ఉన్నాడు. ప్రస్తుతం వెస్టిండిస్‌తో జరుగుతున్న ఐదు వన్డేల సిరిస్‌లో శిఖర్ ధావన్ ఓపెనర్‌గా పెద్దగా ఆకట్టుకోవడం లేదు. ఈ సిరిస్‌లో ఇప్పటివరకు ముగిసిన నాలుగు వన్డేల్లో ధావన్ 4, 29, 35, 38 పరుగులు మాత్రమే చేశాడు.

విండిస్ సిరిస్‌లో ధావన్ పేలవ ప్రదర్శన
ఈ ఏడాది ధావన్ ఫామ్ లేమితో సతమతమవుతున్నాడు. ఇటీవలే యూఏఈ వేదికగా జరిగిన ఆసియా కప్‌లో మాత్రం ధావన్ సెంచరీతో పాటు అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్‌గా నిలిచాడు. అయితే, ప్రస్తుతం వెస్టిండిస్‌తో జరుగుతున్న వన్డే సిరిస్‌లో ధావన్ పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications