కోహ్లీ సారథ్యంలో టీమిండియా 39 విజయాలు
ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై కోహ్లీ సేన 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 50 వన్డేలకు కెప్టెన్‌గా వ్యవహరించిన విరాట్ కోహ్లీ 39వ విజయాన్ని అందుకోగా... 11 అపజయాలను నమోదు చేసుకున్నాడు. దీంతో మొదటి 50 వన్డేలకు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించి ఎక్కువ విజయాలు నమోదు చేసుకున్న ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ చోటు దక్కించుకున్నాడు.
మూడో స్థానాన్ని దక్కించుకున్న కోహ్లీ
ఈ జాబితాలో విరాట్ కోహ్లీ మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. తొలి వన్డే విజయంతో వెస్టిండీస్ మాజీ కెప్టెన్ క్లైవ్ లాయిడ్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ల సరసన కోహ్లీ చేరాడు. మొదటి 50 వన్డేల్లో పాంటింగ్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా 9 మ్యాచ్‌ల్లో ఓడిపోగా... కోహ్లీ(10 మ్యాచ్‌లు), లాయిడ్(11) మ్యాచ్‌ల్లో ఆయా జట్లు ఓడిపోయాయి.
విజయాల శాతంలో కోహ్లీదే అగ్రస్థానం
అయితే, మ్యాచ్ విజయాల శాతంలో మాత్రం విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. 50 వన్డేల్లో కోహ్లీ విజయాల శాతం 79.59 కాగా క్లైవ్ లాయిడ్ 77.71 శాతం..... పాంటింగ్ 76.14 శాతంతో ఆ తరువాతి స్థానాల్లో ఉన్నారు. మరోవైపు తొలి వన్డేలో కోహ్లీ 75 పరుగులు చేయడంతో కోహ్లీ తన కెరీర్లో మరో ఘనత అందుకున్నాడు.
వన్డేల్లో వరుసగా తొమ్మిదో సారి
వన్డేల్లో వరుసగా తొమ్మిదో సారి ఒక కేలండర్ ఇయర్లో 1000కి పైగా పరుగులు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. కాగా, ఆతిథ్య ఇంగ్లాండ్‌తో గురువారం జరిగిన తొలి వన్డేలో కోహ్లీ స్టంపౌట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో స్టంపౌట్ అవ్వడం ఇది మూడో సారి. 2011లో కోహ్లీ తొలిసారి స్టంపౌట్ అయ్యాడు.