Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Bangladesh vs Srilanka : బంగ్లాను ఓడించడం ఈజీ అన్న షనక.. గ్రౌండ్లో చూసుకుందామన్న బంగ్లా డైరెక్టర్

Dasun Shanaka says bangla is Easy opponent. Strong counter Given by Bangla director Mahmud

నేడు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు చావో రేవో తేల్చుకోవడానికి సిద్ధమయ్యాయి. రెండు జట్లు ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లలో ఓడిపోవడంతో ఈ మ్యాచ్ ఇరు జట్లకు నాకౌట్ లాగా మారింది. ఏ జట్టు గెలిస్తే ఆ జట్టు సూపర్ 4కు చేరుకుంది. ఓడిన జట్టు టోర్నమెంట్ నుండి నిష్క్రమిస్తుంది.

ఇరు జట్లు ఆసియా కప్‌లో ఇప్పటివరకు తలపడగా.. శ్రీలంక 8సార్లు గెలవగా.. బంగ్లా 4సార్లు గెలిచింది. ఇకపోతే బంగ్లాదేశ్ బౌలింగ్ అటాక్‌ గురించి ఇటీవల శ్రీలంక కెప్టెన్ దసున్ షనక కీలక కామెంట్లు చేసిన సంగతి తెలిసింది. ఆప్ఘనిస్థాన్‌తో పోలిస్తే బంగ్లాందేశ్‌ను ఓడించడం చాలా ఈజీ అంటూ అతను పేర్కొన్నాడు. దీంతో ఇరు జట్టు మేనేజ్ మెంట్ల మధ్య కుంపటి రాజుకుంది. బంగ్లాదేశ్ జట్టు డైరెక్టర్ ఖలీద్ మహమూద్ దీనిపై ఓ కీలక వ్యాఖ్యలు చేశాడు. షనక ప్రకటనకు అదిరిపోయే కౌంటరిచ్చాడు.

కచ్చిత కారణం తెలియదు

కచ్చిత కారణం తెలియదు

బంగ్లాదేశ్‌ను ఆఫ్ఘనిస్తాన్ కంటే తేలికైన ప్రత్యర్థిగా షనక ​​పేర్కొనడం వెనుక కచ్చితమైన కారణం తనకు తెలియదని మహమూద్ పేర్కొన్నాడు. బంగ్లాదేశ్‌‌లో కేవలం ఇద్దరు మాత్రమే ప్రపంచ స్థాయి బౌలర్లు ఉన్నారని షనక చేసిన ప్రకటనను అతను ప్రస్తావిస్తూ.. మాకు ఇద్దరు అయినా ఉన్నారు మరీ శ్రీలంకకు కనీసం ఒక్కరు కూడా లేరు కదా అంటూ ఎద్దేవా చేశాడు.

మాకు ముస్తాఫిజుర్, షకీబ్ ఉన్నారు మరీ మీకు..?

మాకు ముస్తాఫిజుర్, షకీబ్ ఉన్నారు మరీ మీకు..?

'షనక ఎందుకు అలా అన్నాడో అది అతనికి లియాలి. మేం సులభంగా ఓడించే జట్టు అని ఎందుకు అనుకుంటుండో అది చూద్దాం. షనక ఉద్దేశం ఏంటో గ్రౌండ్లో తెలుస్తుంది. బహుశా ఆఫ్ఘనిస్తాన్‌కు మెరుగైన టీ20 జట్టు ఉందని.. అందుకే మమ్మల్ని తక్కువగా చూస్తున్నాడేమో.

అతను ఇంకా చాలా విషయాలు చెప్పాడు. మా జట్టులో కేవలం ఇద్దరే ప్రపంచ స్థాయి బౌలర్లు ఉన్నారన్నాడు. మరీ శ్రీలంకలో అయిదారుగురు ఉన్నారా ఏంటీ.. శ్రీలంకలో ఒక్కరు కూడా లేరు. మాకు ముస్తాఫిజుర్, షకీబ్ ఉన్నారు.. మరి వారికి మా లాంటి ప్రపంచ స్థాయి బౌలర్లు ఉన్నారని ఒప్పుకోమను.' అని ఖలీద్ మహమూద్ ఫైర్ అయ్యాడు.

తుది జట్ల అంచనా

తుది జట్ల అంచనా

శ్రీలంక ప్లేయింగ్ XI: దనుష్క గుణతిలక, పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్ (Wk), చరిత్ అసలంక, భానుక రాజపక్స, దసున్ షనక (c), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, దిల్షన్ మధుశంక, మతీషా పతిరణ.

బంగ్లాదేశ్ ప్లేయింగ్ XI: మహ్మద్ నయీమ్, అనాముల్ హక్, షకీబ్ అల్ హసన్ (c), అఫీఫ్ హుస్సేన్, ముష్ఫికర్ రహీమ్ (WK), మొసద్దెక్ హొస్సేన్, మహ్మదుల్లా, మహేదీ హసన్, మహ్మద్ సైఫుద్దీన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మాన్.

Story first published: Thursday, September 1, 2022, 15:29 [IST]
Other articles published on Sep 1, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+