పాక్ గడ్డపై శ్రీలంక క్లీన్ స్వీప్: ధోని, క్లార్క్ సరసన దాసన్ షణక

హైదరాబాద్: దాసన్ షణక నాయకత్వంలోని శ్రీలంక ద్వితీయ శ్రేణి జట్టు పాకిస్థాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను శ్రీలంక క్లీన్‌స్వీప్ చేసింది. ఒషాడ ఫెర్నాండో (78) హాఫ్ సెంచరీతో రాణించడంతో బుధవారం జరిగిన మూడో టీ20లో పాకిస్థాన్ 13 పరుగుల తేడాతో ఓడిపోయింది.
ఈ క్రమంలో శ్రీలంక కెప్టెన్ దాసన్ షణక ఓ అరుదైన రికార్డుని సాధించాడు. పాకిస్థాన్ జట్టుపై 3 టీ20ల సిరిస్‌ను క్లీన్ స్వీప్ చేసిన మూడో కెప్టెన్‌గా అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకముందు పాకిస్థాన్ జట్టుపై 3 టీ20ల సిరిస్‌ను నెగ్గిన కెప్టెన్ల జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(2007-2012), ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్‌లు మాత్రమే ఉన్నారు.

ధోని సరసన షణక
ఇప్పుడు వీరి సరసన దాసన్ షణక నిలిచాడు. భద్రతా కారణాల దృష్ట్యా లసిత్ మలింగ లాంటి శ్రీలంక సీనియర్ క్రికెటర్లు పాకిస్థాన్ పర్యటన నుంచి తప్పుకోవడంతో శ్రీలంక క్రికెట్ బోర్డు ద్వితీయ శ్రేణి ఆటగాళ్లతో కూడిన జట్టుని పాకిస్థాన్ పర్యటనకు పంపింది. టీ20ల్లో తన కంటే ఎంతో బలహీనమైన ఈ జట్టు చేతిలో పాకిస్థాన్ చిత్తుగా ఓడిపోయింది.

టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో
టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న పాకిస్థాన్ జట్టుకు ఈ ఓటమి మింగుపడటం లేదు. అంతేకాదు పదేళ్ల తర్వాత సొంతగడ్డపై సొంత ప్రేక్షకుల మధ్య అద్భుత ప్రదర్శన చేద్దామన్న పాక్ ఆటగాళ్ల ఆశలు ఆవిరయ్యాయి. స్వదేశంలో జరిగిన తొలి టీ20 సిరీస్‌ను పాకిస్థాన్ కాపాడుకోవడంలో పూర్తిగా విఫలమైంది.

మూడో టీ20లో
బుధవారం జరిగిన మూడో టీ20లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఒషాదా ఫెర్నాండో (78 నాటౌట్, 48 బంతుల్లో 8ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు. అనంతరం 148 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్టు కోల్పోయ 134 పరుగులకే పరిమితమైంది.

ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా హసరంగా
పాక్ ఆటగాళ్లలో హారిస్ సోహైల్ (52; 50 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్) మినహా ఎవరూ అంతగా రాణించలేదు. శ్రీలంక బౌలర్లలో వనిండు హసరంగా మూడు వికెట్లు తీయగా.. లహిరు కుమార రెండు వికెట్లు తీశాడు. ఈ సిరీస్‌లో రాణించిన హసనరంగాకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్', ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డులు లభించాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications