Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

శ్రీలంక కెప్టెన్‌గా దసున్ షనక రికార్డు.. అతని తర్వాతనే జయవర్ధనే, సంగక్కర, చండిమాల్

Dasun Shanaka got a Record of Most Matches Win As A Captain of Srilanka

ఆసియాకప్ 2022 సూపర్ 4లో శ్రీలంక ఆఫ్ఘానిస్థాన్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో 4వికెట్ల తేడాతో గెలుపొంది శుభారంభం చేసిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో లీగ్ మ్యాచ్‌లో ఆఫ్ఘన్ చేతిలో ఓడిపోయిన శ్రీలంక.. లెక్క సరిచేసింది. ఇకపోతే ఈ విజయంతో శ్రీలంక కెప్టెన్ దసున్ షనక ఓ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో అత్యధిక విజయాలు సాధించిన శ్రీలంక కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పాడు. అతను ఇప్పటివరకు 31 మ్యాచ్‌లకు కెప్టెన్సీ వహించగా.. 14 మ్యాచ్‌ల్లో శ్రీలంక గెలుపొందింది. 16 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఒక మ్యాచ్ టై అయింది. కెప్టెన్‌గా అతని విన్నింగ్ పర్సంటేజీ 46.77గా ఉంది. అంతకుముందు అత్యధిక టీ20 మ్యాచ్‌లు గెలిచిన కెప్టెన్లుగా 13విజయాలతో జయవర్ధనే, సంగక్కర, చండిమాల్ సమానంగా ఉన్నారు. ఇకపోతే వీరిలో అత్యధిక విన్నింగ్ పర్సంటేజీ ఉన్నవారిలో 65.78శాతంతో జయవర్ధనే ముందున్నాడు.

ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ నిర్ణీత 20ఓవర్లలో 6 వికెట్లకు 175పరుగులు చేసింది. రెహ్మానుల్లా గుర్బాజ్ (45 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 84) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఇబ్రహీమ్ జడ్రాన్ (38 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 40) కూడా రాణించాడు. శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మధుషనక రెండు వికెట్లు తీయగా.. అసిత ఫెర్నాండో, మహీష్ తీక్షణ తలో వికెట్ పడగొట్టారు.

అనంతరం శ్రీలంక 19.1 ఓవర్లలో 179 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్లు పాతుమ్ నిస్సంక (28 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 35), కుశాల్ మెండీస్ (19 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 36), భానుక రాజపక్స(14 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 31) రాణించగా.. హసరంగా(9 బంతుల్లో 3 ఫోర్లతో 17 నాటౌట్) కీలక ఇన్నింగ్స్‌లు ఆడి విజయ లాంఛనాన్ని పూర్తి చేశారు.

Story first published: Sunday, September 4, 2022, 16:04 [IST]
Other articles published on Sep 4, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+