Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాక్ అభిమానులను ఫూల్ చేసిన వెస్టిండీస్ క్రికెటర్

Darren Sammy Plays Hilarious April Fools Day Prank On Fans

హైదరాబాద్: పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో అదరగొట్టిన వెస్టిండీస్ క్రికెటర్ అభిమానులను ఫూల్ చేశాడు. ఏప్రిల్‌ 1 సందర్భంగా అతను చేసిన ట్వీట్ పేలింది. పీఎస్‌ఎల్‌లో సెమీ పెష్వార్‌ జల్మీ జట్టుకి కెప్టెన్సీ వహించాడు. అయితే సెమీ కొన్నాళ్లుగా విండీస్‌ జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నాడు.

కానీ, ఆదివారం ఏప్రిల్ 1 పురస్కరించుకొని మళ్లీ తన దేశానికి పాత్రినిధ్యం వహించాలనుకుంటున్నానని ట్వీట్ చేశాడు. 'మీరు ఇది నమ్మలేరు.. నేను మెరున్‌(విండీస్‌ జెర్సీ) జెర్సీ వేసుకొని పాక్‌లో మెరుస్తాను.' అంటూ ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఈ ట్వీట్‌తో షాక్‌కు గురైన అభిమానులు ఆనందపడ్డారు.

సెమీ రాకకు ట్వీట్లతో స్వాగతం పలికారు. కొందరు అతనిపై వ్యంగ్యంగా బదులిచ్చినా ఆ ట్వీట్‌నైతే నమ్మేశారు. 'మీ జల్మీ జట్టు సహచరుడు హసన్‌ అలీ నిన్ను తొలి బంతిని అవుట్‌ చేయడానికి సిద్దంగా ఉన్నాడు.' 'నీ మాటలు నాకు తియ్యని పాటగా వినబడుతున్నాయి' అంటూ కామెంట్‌లు చేశారు. అయితే మరికొద్ది సేపట్లోనే వారి ఆనందం ఆవిరయ్యేలా చేశాడు డారెన్ సెమీ.

'ఇది నేను ఊహించలేదు.. ఇంతటితో మెరున్‌ జెర్సీలో ఆడాలనే నా ఆలోచన ముగిసింది.' అని ఏప్రిల్‌ ఫూల్‌ చేశాడు. అయితే ఈ ప్రాంక్‌పై సామీ క్షమాపణలు కోరుతూ చాలా మంది తాను జట్టులోకి తిరిగి రావలని కోరుకుంటున్నారని మరో ట్వీట్‌ చేశాడు. సామీ ట్వీట్‌కు పాక్‌ అభిమానులు స్పందించడానికి కారణం.. 9 ఏళ్ల తర్వాత విండీస్‌ జట్టు పాక్‌లో పర్యటిస్తుంది. పైగా ఈ సిరీస్‌కు విండీస్‌ సీనియర్‌ ఆటగాళ్లు సైతం దూరమయ్యారు.

Story first published: Tuesday, April 3, 2018, 9:03 [IST]
Other articles published on Apr 3, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+