For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'బిగ్ ఇడియట్' అంటూ వివాదాస్పదం: వేటు వేసిన బోర్డు

By Nageshwara Rao

సెయింట్ జాన్స్: వెస్టిండిస్ స్టార్ బ్యాట్స్‌మెన్ డారెన్ బ్రావోకు ఆ దేశ క్రికెట్ బోర్డు డబ్ల్యూఐసీబీ షాక్‌ ఇచ్చింది. కాంట్రాక్టు విషయంలో వెస్టిండిస్ క్రికెట్ బోర్డుపై ట్విట్టర్‌లో 'బిగ్‌ ఇడియట్‌' అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గాను అతడిపై వేటు వేసింది.

త్వరలో జింబాబ్వేలో జరగనున్న ముక్కోణపు వన్డే సిరీస్‌‌కు ఎంపిక చేసిన జట్టులో 27 ఏళ్ల డారెన్ బ్రావోను ఎంపిక చేయలేదు. వివరాల్లోకి వెళితే... వెస్టిండిస్ క్రికెట్ బోర్డు డారెన్ బ్రావోకు సీ-కేటగిరి కాంట్రాక్టును ఆఫర్ చేసింది.

Darren Bravo axed by WICB following Twitter outburst over 'big idiot'remark

అయితే ఈ కాంట్రాక్టును తీసుకోవడం ఇష్టం లేని అతడు బోర్డుపై బహిరంగంగా విమర్శలు గుప్పించాడు. స్టార్‌ ఆటగాళ్లకు తక్కువ స్థాయి కాంట్రాక్టులు కట్టబెడతారా? అని ట్విట్టర్‌‌లో బోర్డుని సూటిగా ప్రశ్నించాడు. అంతేకాదు డబ్ల్యూఐసీబీ అధ్యక్షుడు డేవ్‌ కెమరాన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశాడు. డేవ్‌ బిగ్‌ ఇడియట్‌ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు.

ఈ వ్యాఖ్యల ఫలితంగా డారెన్ బ్రావోకు జట్టులో చోటు కల్పించలేదు. అతడి స్థానంలో ఆల్‌ రౌండర్‌ జాసన్‌ మహమ్మద్‌ను జట్టులోకి తీసుకున్నారు. అంతేకాదు అనుచిత ప్రవర్తన కారణంగా బ్రావోను ఎంపిక చేయలేదని వెస్టిండిస్ క్రికెట్ బోర్టు ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఇదిలా ఉంటే వెస్టిండిస్ తరుపున 95 వన్డేలాడిన బ్రావో 2,955 పరుగులు చేశాడు. ఇక 30 ఏళ్ల ఆల్ రౌండర్ జాసన్‌ మహమ్మద్‌ ఇటీవలే శ్రీలంకతో జరిగిన సిరిస్‌లో రాణించడంతో అతడికి చోటు కల్పించారు. ఇక వ్యక్తిగత కారణాలతో వైదొలగిన ఆఫ్ స్పిన్నర్ సునీల్‌ నరైన్‌ స్థానంలో లెగ్ స్ఫిన్నర్ దేవేంద్ర బిషూను తీసుకున్నారు.

జింబాబ్వే పర్యటకు వెస్టిండిస్ జట్టు: జాసన్ హోల్డర్ (కెప్టెన్), సులేమాన్ బెన్, దేవేంద్ర బిషూ, కార్లోస్ బ్రాత్ వైట్, గ్రైగ్ బ్రాత్ వైట్, జోనాథన్ కార్టర్, జాన్సన్ చార్లెస్, మిగుల్ సుమ్మిన్స్, షేన్ డౌరిచ్, షానన్ గాబ్రియేల్, షై హోప్, ఎవిన్ లెవిస్, జాసన్ మహ్మద్, యాష్లే నర్స్, రోవ్మాన్ పావెల్.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+