న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నార్వే మహిళ రేప్ ఆరోపణలు, గుణతిలకపై వేటు విధించిన లంక బోర్డు

Danushka Gunathilaka Suspended by SLC After Friend is Accused of Rape

హైదరాబాద్: సఫారీ జట్టుతో తలపడుతోన్న శ్రీలంక జట్టుకు పెద్ద షాక్..! లంక జట్టు స్టార్ బ్యాట్స్‌మన్ దనుష్క గుణతిలక ఓ మహిళ చేసిన రేప్ ఆరోపణల కారణంగా సస్పెండ్‌కు గురైయ్యాడు. ఇప్పటి వరకూ సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో అద్భుత బ్యాటింగ్‌తో అదరగొట్టిన గుణతిలకను నిబంధనలు ఉల్లంఘించాడనే కారణంతో శ్రీలంక క్రికెట్ బోర్డ్ అతణ్ని సస్పెండ్ చేసింది.

అసలేం జరిగిందంటే:
గుణతిలక స్నేహితుడు హోటల్ గదిలో తనను (నార్వే మహిళను) రేప్ చేశాడంటూ ఆరోపణలు చేయడంతో.. లంక క్రికెట్ బోర్డ్ ఈ నిర్ణయం తీసుకుంది. బాధిత మహిళ నిందితునితో పాటు గుణతిలక కూడా రేప్ జరిగిన సమయంలో అదే హోటల్‌ గదిలోనే ఉన్నాడని ఆమె ఆరోపించింది.

కొలంబోలో క్రికెటర్లు బస చేస్తోన్న హోటల్ గదికి గుణతిలక, అతడి స్నేహితుడు (శ్రీలంక సంతతికి చెందిన బ్రిటన్ వ్యక్తి ) కలిసి.. ఆదివారం వేకువ జామున ఇద్దరు నార్వే మహిళలను తీసుకెళ్లారు. ఆ ఇద్దరు నార్వే మహిళల్లో ఒకరు.. హోటల్‌లో తనపై అత్యాచారం జరిగిందని పేర్కొన్నారు. ఈ ఉదంతం జరిగినప్పుడు అదే గదిలో క్రికెటర్ గుణతిలక కూడా ఉన్నాడని వివరించారు.

దీంతో పోలీసులు క్రికెటర్ స్నేహితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. నార్వే పర్యాటకురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు అర్ధరాత్రిలోగా హోటల్ రూమ్‌కి చేరుకోవాలి, అతిథులెవరితోనూ గడపొద్దనే లంక క్రికెట్ బోర్డు నిబంధనను గుణతిలక ఉల్లంఘించాడు. దీంతో బోర్డు తమ ఓపెనర్‌పై వేటు వేసింది. విచారణ పూర్తయ్యే వరకు రెండో టెస్టు మ్యాచ్ ఫీజును నిలిపేయాలని బోర్డు నిర్ణయించింది.

Story first published: Monday, July 23, 2018, 16:58 [IST]
Other articles published on Jul 23, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X