Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'మంచుగడ్డ వేగంగా చెట్టును ఢీకొడితే ఎలా ఉంటుందో.. ఆరోజు సచిన్ బ్యాటింగ్ అలా అనిపించింది'

Danny Morrison recalls magic of 16 year old Sachin Tendulkar

నేపియర్: క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ బ్యాటింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 16 ఏళ్లకే భారత క్రికెట్ జట్టుకు ఎంపికై 24 ఏళ్ల పాటు ఎన్నో రికార్డులు కొల్లగొట్టాడు. తనదైన బ్యాటింగ్‌తో టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యంకానన్ని పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు. ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో వంద శతకాలు బాదిన ఏకైక క్రికెటర్‌గా నిలిచాడు. అయితే సచిన్ కెరీర్ ఆరంభంలోనే ఓ అద్భుత రికార్డును చేజార్చుకున్నాడు.

తృటిలో అద్భుత రికార్డు మిస్:

తృటిలో అద్భుత రికార్డు మిస్:

1989లో పాకిస్థాన్‌ పర్యటనలో టెస్టుల్లో అరంగేట్రం చేసిన సచిన్‌ టెండూల్కర్.. ఆ తర్వాత 1990లో న్యూజిలాండ్‌ పర్యటనకు ఎంపికయ్యాడు. నేపియర్‌ టెస్టులో 88 పరుగులు చేసి తృటిలో అద్భుత రికార్డు చేజార్చుకున్నాడు. అప్పటికి పాక్‌ క్రికెటర్‌ ముస్తక్‌ మహ్మద్‌ టెస్టుల్లో సెంచరీ బాదిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. అయితే సచిన్‌ దాన్ని కోల్పోయాడు. అప్పుడే అతనిలోని యువ నెత్తురును చూశానని న్యూజిలాండ్‌ పేసర్ డానీ మోరిసన్‌ అన్నాడు. సెంచరీకి చేరువలో ఉండగా సచిన్ వేగంగా పరుగులు తీయాలనుకున్నాడని తెలిపాడు. అతనిలో యువ క్రికెటర్‌కు ఉండే ఉత్సాహం కనిపించిందన్నాడు.

సచిన్‌లోని యువ నెత్తురును చూశా:

సచిన్‌లోని యువ నెత్తురును చూశా:

తాజాగా ఎడ్జెస్‌ అండ్‌ స్లెడ్జెస్‌ అనే పాడ్‌కాస్ట్‌లో డానీ మోరిసన్ మాట్లాడుతూ... '1990లో న్యూజిలాండ్‌ పర్యటనకు వచ్చిన సచిన్‌ అద్భుతంగా ఆడాడు. అతని ఆట చాలా అందంగా అనిపించింది. దిగ్గజ బౌలర్‌ రిచర్డ్‌ హ్యాడ్లీ బౌలింగ్‌లోనూ మంచి షాట్లు ఆడాడు. అప్పటికి పాక్‌లో ఆడిన అనుభవం మాత్రమే సచిన్‌కు ఉంది. అయినా బాగా ఆడాడు. ఆరోజును గుర్తు చేసుకుంటే కొన్ని అద్భుతమైన షాట్లు కళ్లముందు కదలాడుతాయి. 88 పరుగుల వద్ద ఉన్నపుడు సచిన్ ఉత్సాహంగా కనిపించాడు. వేగంగా పరుగులు తీయాలనుకున్నాడు. అప్పుడు నేను వేసిన ఓవర్‌లోనే మూడు ఫోర్లు కొట్టాడు. ఆ సమయంలో సచిన్‌లోని యువ నెత్తురును చూశాను' అని తెలిపాడు.

మంచుగడ్డ వేగంగా చెట్టును ఢీకొడితే ఎలా ఉంటుందో:

మంచుగడ్డ వేగంగా చెట్టును ఢీకొడితే ఎలా ఉంటుందో:

'నేపియర్‌లో సచిన్ టెండూల్కర్‌కు సెంచరీ సాధించాలని బలంగా ఉంది. కానీ అదే స్కోర్‌ వద్ద నా బౌలింగ్‌లో జాన్ ‌రైట్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఆ టెస్టులో సచిన్ బ్యాటింగ్‌ ఎలా అనిపించిందంటే.. హిమాలయాల నుంచి ఓ మంచు గడ్డ వేగంగా కిందకు వచ్చి ఒక్కసారిగా చెట్టును ఢీకొడితే ఎలా ఉంటుందో అలా అనిపించింది' అని డానీ మోరిసన్‌ వివరించాడు. అంతర్జాతీయ కెరీర్‌లో మోరిసన్‌ ఇప్పటివరకు 48 టెస్టుల్లో, 96 వన్డే మ్యాచ్‌ల్లో కివీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. టెస్టుల్లో 160, వన్డేల్లో 126 వికెట్లు పడగొట్టాడు.

వంద శతకాలు బాదిన ఏకైక క్రికెటర్:

వంద శతకాలు బాదిన ఏకైక క్రికెటర్:

అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యంకానన్ని పరుగులతో సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో నిలిచాడు. లిటిల్ మాస్టర్ తన కెరీర్‌ మొత్తంలో 34,357 పరుగులు చేశాడు. టెస్టుల్లో 15,921.. వన్డేల్లో 18426, టీ20ల్లో 10 రన్స్ బాదాడు. వన్డేల్లో తొలి ద్విశతకం బాదిన క్రికెటర్‌గా సచిన్ చరిత్ర సృష్టించాడు. 2012 మార్చి 16న శతకం బాది.. ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో వంద శతకాలు బాదిన ఏకైక క్రికెటర్‌గా నిలిచాడు. అత్యధికంగా ఆరుసార్లు ప్రపంచకప్‌ ఆడిన క్రికెటర్‌గా కూడా సచిన్ రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ టెస్టుల్లో 200 మ్యాచ్‌లు ఆడిన ఒకేఒక్క ఆటగాడు మాస్టర్‌ బ్లాస్టర్ కావడం విశేషం. 2012 డిసెంబర్‌లో వన్డేలకు రిటైర్మెంట్‌ ప్రకటించిన సచిన్.. 2013 అక్టోబర్‌లో టీ20లకు, 2013 నవంబర్‌ 13న అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

Story first published: Friday, July 31, 2020, 20:05 [IST]
Other articles published on Jul 31, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+