
విలువలు లేని క్రికెటర్
ఓ టీవీ కార్యక్రమంలో మియాందాద్ మాట్లాడుతూ... 'కనేరియా చెప్పేవన్నీ అబద్ధాలు. డబ్బు కోసం ఏమైనా మాట్లాడతాడు. అతడు విలువలు లేని క్రికెటర్. ఇలా చెయ్యడం ద్వారా వాళ్లేం లబ్ధి పొందుతారో నాకు అర్థం కావట్లేదు. క్రికెట్‌లో ఫిక్సింగ్‌కు పాల్పడిన ఒక క్రికెటర్ మాటలు ప్రజలు ఎలా నమ్ముతున్నారో నన్ను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అతను దేశ పరువును తీశాడు' అని అన్నారు.

హిందూ అనే వివక్ష చూపట్టలేదు
'2000 దశకం తొలి నాళ్లలో పాకిస్థాన్‌కు హెడ్ కోచ్‌గా ఉన్నా. కనేరియా కూడా జట్టులో ఉన్నాడు. ఆ సమయంలో అతడు మత వివక్షకు గురైన సంఘటన ఒక్కటి కూడా నాకు తారస పడలేదు. పాకిస్థాన్ జట్టు అతడికి ఎంతో గౌరవం, కీర్తిని తెచ్చిపెట్టింది. పదేళ్ల పాటు పాక్ జట్టుతో ఆడాడు. అతను హిందూ అనే వివక్ష ఎవరూ చూపట్టలేదు. ఒకవేళ నిజంగా అతడు మత వివక్షకు గురైతే అన్నేళ్లు కొనసాగేవాడా? 'అని మియాందాద్ ప్రశ్నించారు.

అనవసర రాద్ధాంతం చేయొద్దు
'కనేరియా ఆడేటప్పుడే లెగ్ స్పిన్నర్ స్థానంలో పాకిస్థాన్‌కు ఇతర ఆటగాళ్లు కూడా అందుబాటులో ఉన్నారు. ఇమ్రాన్ తాహిర్ (ఆ సమయంలో పాక్ తరఫున ఆడుతున్నాడు), అలి హుసేన్ రిజ్వి, మన్సూర్ అమ్జాద్ లాంటి వారు మాకు ఉన్నా.. కనేరియానే ఎంపిక చేశారు. ఒకవేళ అతడు వివక్షకు గురైతే ఇదంతా ఎలా జరిగేది?. భారత అభిమానులు ఈ విషయాన్ని అనవసర రాద్ధాంతం చేయొద్దు' అని మియాందాద్ అన్నారు.

అక్తర్ సంచలన వ్యాఖ్యలు
పలువురు పాకిస్తానీ ఆటగాళ్లు కనేరియాపై వివక్ష చూపెట్టేవారంటూ ఆ దేశ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేసాడు. కనేరియాను హిందూ అనే కారణంగా తీవ్రంగా అవమానించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అతనితో కలిసి భోజనం చేయడానికి కూడా అయిష్టత చూపెట్టడం చూశానన్నాడు. జట్టులోని మెజార్టీ సభ్యులు మాత్రమే వివక్ష చూపెట్టేవారన్నాడు. ఇందుకు అక్తర్‌కు కనేరియా థాంక్స్ చెప్పడంతో పాటు పేర్లను త్వరలోనే వెల్లడిస్తానంటూ పేర్కొన్నాడు. దాంతో కనేరియాపై మియాందాద్ మండిపడ్డాడు.


Click it and Unblock the Notifications












