India Tour Of Zimbabwe : విరాట్ కోహ్లీకి ఓ పద్ధతి ప్రకారం అన్యాయం జరుగుతోంది.. డానిష్ కనేరియా కామెంట్లు

వచ్చే నెలలో జింబాబ్వేతో వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఎంపిక కాలేదు. అతన్ని ఎంపిక చేయకపోవడం పట్ల పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా తీవ్ర విమర్శలు చేశాడు. జింబాబ్వేలో 50ఓవర్ల ఫార్మాట్ మ్యాచ్‌లోనైనా కోహ్లీ మళ్లీ ఫామ్‌లోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉండేవని కనేరియా పేర్కొన్నాడు. కోహ్లీని జింబాబ్వే టూర్‌కు ఎందుకు ఎంపిక చేయలేదంటూ టీమిండియా సెలెక్షన్ కమిటీకి ప్రశ్నలు సంధించాడు. అలాగే కోహ్లీని ఆసియా కప్ టోర్నీకి కూడా తీసేయొచ్చు అని జోస్యం చెప్పాడు

అతనికి జట్టులో స్థానం మరింత కష్టమయ్యేలా..!
'విరాట్ కోహ్లీ జింబాబ్వేతో జరగబోయే వన్డే సిరీస్‌లో ఆడాల్సింది. అతను పెద్ద పెద్ద టోర్నమెంట్లలో మాత్రమే ఆడాలని బీసీసీఐ భావిస్తుందేమో. కానీ ఒకవేళ అతను అక్కడ విఫలమైతే.. అతని ఫామ్ లేమి గురించి మరోసారి చర్చలు ఊపందుకుంటాయి. తద్వారా విరాట్ కోహ్లీకి జట్టులో స్థానం మరింత కష్టమవుతుంది. ఇది విరాట్‌కు అన్యాయం చేయడమేనని నేను భావిస్తున్నాను. ' అన్న కనేరియా కోహ్లీకి ఓ పద్ధతి ప్రకారం అన్యాయం జరుగుతుందని తన యూట్యూబ్ ఛానెల్‌లో కామెంట్లు చేశాడు.

ఆసియా కప్ టోర్నీకి కూడా డౌటే..!
'మీరు విరాట్ కోహ్లీని ఎలా హ్యాండిల్ చేయాలనుకుంటున్నారో మీకైనా స్పష్టత ఉండాలి. వెస్టిండీస్ పర్యటన మొత్తానికి అతను విశ్రాంతి తీసుకున్నాడు. అందువల్ల అతను కచ్చితంగా జింబాబ్వే సిరీస్‌లో ఆడి తీరాల్సింది. ఎందుకంటే టీ20ల్లో కన్నా వన్డేల్లో ఫామ్ పొందడం కాస్త సులభం. అతను ఎంపికై ఉంటే.. జింబాబ్వేతో వన్డే సిరీస్లో మళ్లీ తన ఫామ్‌ను పొందేవాడు. ఇప్పుడు అతను నేరుగా ఆసియా కప్ టోర్నీలో ఆడాల్సిన పరిస్థితి. నా డౌట్ ఏంటంటే.. అతను ఆసియా కప్‌కు కూడా ఎంపిక కాడనిపిస్తుంది.' కనేరియా చెప్పాడు.

రెస్ట్ ఇస్తూనే ఉన్నారుగా..!
ఇషాన్ కిషన్ స్థానంలో కోహ్లీ జింబాబ్వే పర్యటనకు ఎంపిక కావాల్సిందని కనేరియా చెప్పాడు. తద్వారా సంజూ శాంసన్ మూడు వన్డేల్లో 'ఒత్తిడి' లేకుండా ఆడేవాడని కనేరియా చెప్పాడు. ఇక ఐపీఎల్ టైంలో కోహ్లీ అసలు విశ్రాంతి తీసుకోలేదు. కానీ ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో మాత్రం అతనికి విశ్రాంతినిస్తూనే ఉన్నాడు. అతనికి ఎంతని రెస్ట్ కావాలో నాకైతే అర్థం కావడం లేదు అంటూ కనేరియా విమర్శలు చేశాడు. అలాగే కేఎల్ రాహుల్‌ను కూడా ఎంపిక చేయకపోవడం గురించి కనేరియా స్పందించాడు. 'కేఎల్ రాహుల్ గాయం తీవ్రత ఎలా ఉందో మరీ.. అతను పూర్తిగా కోలుకుని ఫిట్ నెస్ సాధించి ఉంటే జట్టులోకి అతన్ని తీసుకోవాల్సింది. ఎందుకంటే నేరుగా పెద్ద పెద్ద టోర్నీల్లో ఆడించే ముందు అంతర్జాతీయ క్రికెట్లో ద్వైపాక్షిక సిరీస్లో ప్లేయర్లు ఆడితే కొంచెం బెటర్ రిజల్ట్స్ ఉంటాయి.' అని కనేరియా స్పష్టం చేశాడు.

జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు ఎంపికైన భారత జట్టు:
శిఖర్ ధావన్(కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, అవేశ్ ఖాన్, ప్రసిధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్, దీపక్ చాహర్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications