Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Danish kaneria : ఆటగాళ్ల కెరీర్లతో లూడో గేమ్ ఆడొద్దు.. టీమిండియా మేనేజ్‌మెంట్‌పై మండిపాటు

Danish Kaneria Slams Teamindia Management for Continuing kohli and Not Giving Chances to Youngstars

ఇటీవల కాలంలో ఇండియా తరఫున చాలా మంది యువ ప్లేయర్లు రాణిస్తున్నారని, వారికి అవకాశాలివ్వకుండా ఫామ్ కోల్పోయిన విరాట్ కోహ్లీని జట్టుతో పాటు ఎన్ని రోజులు కొనసాగిస్తారని పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా ప్రశ్నించారు. ఇకపోతే విరాట్ కోహ్లీ చాలా కాలంగా ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. దీంతో జట్టులో అతని స్థానాన్ని కొనసాగించడం పట్ల క్రికెట్ నిపుణుల నుంచి విమర్శలు ఎక్కువయ్యాయి. రవిచంద్రన్ అశ్విన్ వంటి ప్రపంచ స్థాయి స్పిన్నర్‌ను జట్టు నుంచి తప్పించినప్పుడు విరాట్ కోహ్లీని ఎందుకు తొలగించలేరని కనేరియా కూ యాప్‌ ద్వారా ప్రస్తావించాడు. టాపార్డర్ బ్యాట్స్‌మెన్ అయినా దీపక్ హుడా ప్రస్తుతం గొప్పగా ఆడుతున్నాడని అతన్ని ఎందుకు పట్టించుకోవట్లేదని కనేరియా విమర్శించాడు. బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఆటగాళ్ల కెరీర్‌తో లూడో గేమ్ ఆడకూడదని ఎద్దేవా చేశాడు.

'వరల్డ్ క్లాస్ ఆఫ్ స్పిన్నర్ అశ్విన్‌ను తప్పించినప్పుడు విరాట్‌ను ఎందుకు తప్పించరు. దీపక్ హుడా లాంటి ప్రతిభావంతులైన క్రికెటర్ల కెరీర్లతో సెలక్షన్ కమిటీ, జట్టు మేనేజ్‌మెంట్ ఎందుకు ఆటలాడుతోంది. ఇండియన్ టీం, ఇండియా అభిమానులతో ఇంతకీ ఎవరూ లూడో గేమ్ ఆడుతున్నారు. అర్ష్‌దీప్, దీపక్ హుడా లాంటి ప్లేయర్లు రానున్న రోజుల్లో భారత క్రికెట్‌కు వెన్నెముకలా మారతారని, సూర్యకుమార్ యాదవ్ సైతం విశ్వసించదగ్గ ప్లేయర్' అని కనేరియా ప్రత్యేకంగా కూ యాప్‌లో పోస్ట్ చేశాడు. విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి రావడానికి అతనికి విశ్రాంతినిస్తూ ఆడిస్తున్న సంగతి తెలిసిందే. ఇక కపిల్ దేవ్, వెంకటేష్ ప్రసాద్, ఇర్ఫాన్ పఠాన్‌లతో సహా చాలా మంది క్రికెట్ ఉద్ధండులు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి వారికి విశ్రాంతినిస్తున్న విధానాన్ని ప్రశ్నించారు. ప్రపంచ కప్‌కు ముందు ఆటగాళ్లు తమ పూర్తి కోటా మ్యాచ్‌లను ఆడాలని సూచించారు.

ఇకపోతే నిన్న ఇంగ్లాండ్ భారత్‌పై 100పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 3ఫోర్లు కొట్టి కాస్త టచ్‌లోకి వచ్చినట్లు కన్పించాడు. కానీ ఎప్పటిలాగే ఆఫ్ స్టంప్ అవతల పడ్డ బంతిని ఆడుతూ కీపర్‌కు దొరికిపోయాడు. దీంతో అతను 16పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. కోహ్లీ మునుపటిలా బ్యాటింగ్లో కాన్ఫిడెన్స్ కూడా చూపించలేకపోతున్నారు. ఇక ప్రస్తుతం వన్డే సిరీస్ 1-1తో సమమైంది. ఆదివారం జరిగే డిసైడర్ అయిన మూడో వన్డేలో ఇరు జట్లు తలపడనున్నాయి.

Story first published: Friday, July 15, 2022, 16:29 [IST]
Other articles published on Jul 15, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+