Danish Kaneria: జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ ఘటనపై పాకిస్థాన్ ఉపప్రధాని ఇషాక్ దార్ చేసిన వ్యాఖ్యలపై ఆ దేశ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అలాంటి ప్రకటనల వల్ల దేశమంతా బాధపడుతోందని కనేరియా వ్యాఖ్యానించాడు. ఉగ్రవాదులను 'స్వాతంత్ర్య సమరయోధులు' అంటూ ప్రేలాపనలు చేసిన పాక్ ఉపప్రధానిపై డానిష్ కనేరియా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాడు.
దీనిపై స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టాడు. ఇది అవమానకరమే కాకుండా.. ఉగ్రవాదానికి మద్దతిస్తున్నాం.. ప్రోత్సహిస్తున్నామంటూ బహిరంగంగా అంగీకరించినట్లు అయిందని డానిష్ కనేరియా తీవ్రంగా మండిపడ్డాడు. ఇప్పటికే పాక్ ప్రధాని మౌనంగా ఉండటంపై డానిష్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసందే. దీంతో పాటు ఉగ్రవాదులను కాపాడటంతో పాటు ఆశ్రయం కల్పించడంపై సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తూనే ఉన్నాడు. తాను పాకిస్థాన్ ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడటం లేదని స్పష్టం చేశాడు.

అయితే అందరికీ ఆశ్చర్యం కలిగించే విధంగా పాకిస్థాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ వారిని 'స్వాతంత్ర్య సమరయోధులు' సంభోదించడం గమనార్హం. ఈ వ్యాఖ్య పట్ల కనేరియా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇషాన్ దార్ ప్రకటనను 'అవమానకరమైనది' అని అభివర్ణించాడు. ఇది ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్నట్లు బహిరంగంగా అంగీకరించిందని పేర్కొన్నాడు.ఇస్లామాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ, "ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ జిల్లాలో దాడులు చేసిన వారు స్వాతంత్ర్య సమరయోధులు కావచ్చు" అని ఇషాక్ దార్ అన్నారు. అంతకుముందు, ఈ విషయంపై పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మౌనంగా ఉండటాన్ని కూడా కనేరియా విమర్శించారు. ఆయన 'ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నారని, వారిని పెంచుతున్నారని' డానిష్ కనేరియా ఆరోపించారు.మాజీ క్రికెటర్ ఉగ్రవాదం పట్ల తన దేశ ప్రభుత్వ వైఖరి గురించి చాలా గట్టిగా మాట్లాడాడు. వారిని రక్షించడం, ఆశ్రయం కల్పించడంపై బహిరంగంగా విమర్శించాడు.
"నేను పాకిస్తాన్ లేదా దేశ ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. పాకిస్తాన్ ప్రజలు ఉగ్రవాదం చేతిలో ఎక్కువగా నష్టపోయారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే లేదా అమాయకులు హత్యకు గురైనప్పుడు మౌనంగా ఉండే నాయకత్వానికి వారు అర్హులు కాదు. శాంతి కోసం నిలబడే నాయకత్వం అవసరం ఉంది. నేను ఒకప్పుడు పాకిస్తాన్ జెర్సీని గర్వంగా ధరించాను. నేను క్రికెట్ మైదానంలో నా చెమట, రక్తాన్ని చిందించాను. కానీ చివరికి, పహల్గామ్ దాడి బాధితుల మాదిరిగానే నాపై కూడా ఎలాంటి తేడా లేకుండా వ్యవహరించారు - కేవలం హిందువు అనే కారణంగానే లక్ష్యంగా చేసుకున్నారు. ఉగ్రవాదాన్ని సమర్థించే వారికి సిగ్గుండాలి. హంతకులను రక్షించే వారికి సిగ్గుండాలి. నేను నిజానికి అండగా నిలుస్తాను. నేను మానవత్వానికి అండగా నిలుస్తాను. పాకిస్తాన్ ప్రజలు కూడా అలాగే ఉంటారని నేను నమ్ముతున్నాను. వారిని తప్పుదారి పట్టించవద్దు. చెడుకు అండగా నిలబడవద్దు" అని డానిష్ కనేరియా ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.