క్రికెటర్‌గా చేతనైనంత చేశాను: జీవితం సాఫీగా లేదు, ప్రధాని సాయం కోరిన పాక్ మాజీ స్పిన్నర్

హైదరాబాద్: తన జీవితం సాఫీగా సాగడం లేదని ప్రధాని ఇమ్రాన్ ఖాన్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తనకు సాయం చేయాలని స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిషేధించబడిన పాక్ స్పిన్నర్ డానిష్ కనేరియా కోరుతున్నాడు. ఓ టీవీ కార్యక్రమంలో తనకు మద్దతుగా మాట్లాడిన షోయబ్ అక్తర్‌కు కనేరియా ధన్యవాదాలు తెలియజేశాడు.
డానిష్ కనేరియా జట్టులోని కొంతమంది పాక్ క్రికెటర్ల చేతిలో వివక్షను ఎదుర్కొన్నాడని మాజీ పేసర్ షోయబ్ అక్తర్ చెప్పుకొచ్చాడు. కనేరియా హిందువు కాబట్టి కొందరు క్రికెటర్లు అతడితో కలిసి భోజనం కూడా చేసే వాళ్లు కాదని గురువారం షోయబ్ అక్తర్ వెల్లడించిన సంగతి తెలిసిందే.

జీవితం మంచి స్థితిలో లేదు
"నా జీవితం మంచి స్థితిలో లేదు. నా సమస్యలను పరిష్కరించడానికి నేను పాక్‌తో పాటు ఇతర దేశాల్లోని చాలామందిని కలిశాను. నాకు ఎటువంటి సహాయం రాలేదు. చాలామంది పాక్ క్రికెటర్ల సమస్యలు పరిష్కారమైనా ఇప్పటికీ నాకే సాయం అందలేదు" అని కనేరియా ఆవేదన చెందాడు.

క్రికెటర్‌గా పాక్‌కు చేతనైనంత చేశాను
"ఒక క్రికెటర్‌గా పాకిస్థాన్‌కు చేతనైనంత చేశాను. దాని గురించి నేను చాలా గర్వపడుతున్నాను. పాక్ ప్రజలు అవసరమైన సమయంలో నాకు సహాయం చేస్తారని సానుకూలంగా ఉన్నాను. ఈ గందరగోళం నుంచి నన్ను బయటపడేసేందుకు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సహా మాజీ క్రికెటర్లు, క్రికెట్ పాలకులు, ఇతర దేశాల సహకారం నాకు అవసరం. దయచేసి ముందుకు వచ్చి నాకు సాయం చెయ్యండి" అని కనేరియా అభ్యర్థించాడు.

మామ అనిల్ దల్పాత్ తర్వాత
కనేరియా మామ అనిల్ దల్పాత్ తర్వాత పాకిస్థాన్ జట్టు తరపున ఆడిన రెండో హిందువుగా కనేరియా నిలిచాడు. పాక్ తరుపున 61 టెస్టులు ఆడి 261 వికెట్లు తీయడంతో పాటు 18 వన్డేలకు కూడా ప్రాతినిథ్యం వహించాడు. గురువారం ఓ టీవీ షోలో పాల్గొన్న అక్తర్ "నా కెరీర్‌లో ప్రాంతీయతపై మాట్లాడటం ప్రారంభించినప్పుడు జట్టులోని ఇద్దరు ముగ్గురి ఆటగాళ్లతో నేను విభేదించేవాణ్ని" అని అన్నాడు.

అక్తర్ వ్యాఖ్యలను సమర్ధించిన కనేరియా
అక్తర్ వ్యాఖ్యలను కనేరియా సమర్థించాడు. "షోయబ్ ఓ లెజెండ్. అతని మాటలు కూడా అతని బౌలింగ్ లాగా మొద్దుబారినవి. నేను ఆడుతున్న రోజుల్లో ఈ విషయం గురించి మాట్లాడే ధైర్యం లేకపోయింది. ఇప్పుడు అక్తర్ చెబుతున్న మాటలు నిజం. అతనితో పాటు ఇంజమాముల్ హక్, మహమ్మద్ యూసుఫ్, యూనిస్ ఖాన్ నాకు మద్దతుగా నిలిచేవాళ్లు" అని కనేరియా తెలిపాడు.

స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన కనేరియా
39 ఏళ్ల కనేరియా 2009లో డర్హామ్‌పై ఎసెక్స్ తరఫున ఆడుతున్నప్పుడు మెర్విన్ వెస్ట్‌ఫీల్డ్‌తో కలిసి స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడు. వెస్ట్‌ఫీల్డ్ తనను ఓ వన్డే గేమ్‌లో 12 పరుగులు ఇవ్వాలని ఒప్పించాడని కనేరియా అంగీకరించాడు. దీంతో వెస్ట్‌ఫీల్డ్‌కు నాలుగు నెలల జైలు శిక్ష విధించడంతోపాటు ఈసీబీ అతడిని ఐదేళ్లపాటు సస్పెండ్ చేసింది. ఆరేళ్ల తిరస్కరణ తర్వాత కనేరియా 2018లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు అంగీకరించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications