
జడేజా 3డీ ఆటగాడు
తాజాగా డానిష్ కనేరియా తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడాడు. 'ఫార్మాట్‌తో సంబంధం లేకుండా బౌలర్లు జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తారు. వాళ్లు వికెట్లు తీస్తేనే మనం మ్యాచ్‌లు గెలవగలం. రవీంద్ర జడేజా గురించి చెప్పాలంటే.. అతడో 3డీ ఆటగాడు. అలాంటి క్రికెటర్‌ను పక్కన పెట్టేయడం సులభం కాదు. అతడు కచ్చితంగా ఆడాల్సిందే. జడ్డూ కీలక సమయాల్లో వికెట్లు తీస్తాడు. లోయర్ ఆర్డర్‌లో పరుగులు చేస్తాడు. మంచి భాగస్వామ్యాలు నెలకొల్పుతాడు. ఇక మెరుపు ఫీల్డింగ్‌తో ఒకట్రెండు రనౌట్లు చేయగలడు. అందుకే టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో భారత్‌లో అతడే అత్యంత విలువైన ఆటగాడు' అని కనేరియా పేర్కొన్నాడు.

10 మ్యాచుల్లో 469 పరుగులు, 28 వికెట్లు
హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చహల్ రావడంతో రవీంద్ర జడేజాకు జట్టులో చోటు లేకుండా పోయింది. రెండేళ్లు జడేజాకు పరిమిత ఓవర్ల క్రికెట్లో సరైన అవకాశాలు లభించలేదు. టెస్టు జట్టులో ఉన్నప్పటికీ రిజర్వు బెంచీపైనే ఉన్నాడు. ఎప్పుడైతే వెన్నెముక గాయంతో హార్దిక్ జట్టుకు దూరమయ్యాడో జడ్డూ కీలకంగా మారాడు. మూడు ఫార్మాట్లలో దుమ్మురేపుతున్నాడు. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో తనదైన ముద్ర వేశాడు. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లోని 10 మ్యాచుల్లో జడేజా 469 పరుగులు చేశాడు. ఇక బంతితో 28 వికెట్లు పడగొట్టాడు.

సౌతాంప్టన్‌లో మొదటి ప్రాక్టీస్
న్యూజిలాండ్‌తో ప్రతిష్టాత్మక ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ జూన్ 18 నుంచి ఆరంభంకానున్న నేపథ్యంలో విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత ఆటగాళ్లు మైదానంలోకి అడుగుపెట్టారు. కఠిన క్వారంటైన్ శనివారం ముగియడంతో.. ఆటగాళ్లు ఆదివారం ప్రాక్టీస్‌లో పూర్తిగా నిమగ్నమయ్యారు. దాదాపు మూడు వారాల తర్వాత టీమిండియాకు ఇదే తొలి ట్రైనింగ్ సెషన్ కావడంతో.. ఆటగాళ్లంతా హుషారుగా ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. రవీంద్ర జడేజా తాను నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. 'సౌతాంప్టన్‌లో మొదటి ప్రాక్టీస్' అంటూ కెప్టెన్ ఇచ్చాడు.


Click it and Unblock the Notifications












