Danish Kaneria : వాళ్లిద్దరు లేకుంటే పాకిస్థాన్ ఉత్తదే.. ఏడాది పాటు ఊరికే టైం పాస్..!

గతేడాది టీ20 ప్రపంచకప్ తర్వాత మిడిలార్డర్‌లో సరైన ప్లేయర్లను తయారు చేయలేదని, కెప్టెన్ బాబర్ ఆజామ్, వికెట్‌కీపర్-బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్‌లపై పాకిస్తాన్ ఎక్కువగా ఆధారపడుతోందని పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా అన్నాడు. ఈ విషయాన్ని అంగీకరించడంలో ఎలాంటి సందేహం లేదని కూడా స్పష్టం చేశాడు. 2021లో జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ గ్రూప్ మ్యాచ్‌లో బాబర్, రిజ్వాన్ ఇద్దరే రికార్డు భాగస్వామ్యం నెలకొల్పి భారత్‌పై పాక్‌ను గెలిపించిన సంగతి తెలిసిందే. ఇక గతేడాది వీరిద్దరే వేర్వేరు సందర్భాలలో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పారు. దక్షిణాఫ్రికాతో 197, వెస్టిండీస్‌తో 158, ఇండియాతో 152 ,ఇంగ్లాండ్‌తో 150, జింబాబ్వేతో 126, నమీబియాతో 113 తదితర కీలక ఓపెనింగ్ భాగస్వామ్యాలను నెలకొల్పుతూ పాక్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.

షోయాబ్ మాలిక్ లాంటి బ్యాటరే లేడు
ఇండియాటుడేతో కనేరియా మాట్లాడుతూ.. ప్రస్తుత పాకిస్తాన్ జట్టులో షోయబ్ మాలిక్ లాంటి వ్యక్తి లేడని, అతను మిడిలార్డర్లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు గట్టెక్కించే ఇన్నింగ్స్ ఆడేవాడని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఓపెనర్లు విఫలమైతే.. మిడిల్ ఆర్డర్‌లో ఎక్కువ ప్రతిభావంతులు, అనుభవశీలురు లేనందున పాకిస్థాన్ బ్యాటింగ్ డొల్లతనం బహిర్గతమవుతుందని కనేరియా చెప్పాడు. 'కచ్చితంగా ఈ విషయం చెప్పాలనుకుంటున్నా.. పాకిస్తాన్ జట్టు బాబర్ ఆజామ్, మహ్మద్ రిజ్వాన్‌లపై ఎక్కువగా ఆధారపడింది.. వారిద్దరూ ఓపెనర్లు. 2021లో వారు భారత బౌలింగ్‌ను చిత్తు చేసి ఒంటరిగా ఆటను గెలిపించారు. వారి బ్యాటింగ్ చూడటానికి బానే ఉంటుంది. అయితే విషయం ఏమిటంటే.. 2021 టీ20 ప్రపంచకప్ తర్వాత.. పాకిస్థాన్ ఎక్కువగా టీ20 మ్యాచ్‌లు ఆడలేదు. అలాగే జట్టులో ప్రభావవంతమైన మిడిల్ ఆర్డర్ బ్యాటర్లను టీం మేనేజ్ మెంట్ తయారు చేయలేదు.' అని కనేరియా పేర్కొన్నాడు.

నెదర్లాండ్స్ బీ టీంతో ఇలా గెలుస్తారా?
'గతంలో జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తెలిసినటువంటి షోయబ్ మాలిక్ లాంటి వారు ఉండేవారు. కానీ ఇప్పుడు అలాంటి ప్లేయర్ మిడిలార్డర్లో లేరు. ప్రారంభంలో 2, 3వికెట్లు కోల్పోతే పాక్ జట్టు ఓ అనామక ఇన్నింగ్స్ మాత్రమే ఆడగలదు. ఇన్నింగ్స్‌ను నిర్మించగల ఆటగాడు అంటూ పేర్కొనదగ్గ ప్లేయరే లేడు. యువ ప్రతిభావంతుడు హార్డ్ హిట్టర్ అయిన ఖుష్దిల్ షా ఉన్నా అతనికి అనుభవం అంతగా లేదు. ఫాఖర్ జమాన్ టీ20ల్లోనూ తన హవా చూపించాలి. ఇక నెదర్లాండ్స్‌తో నిన్న జరిగిన వన్డేలో పాక్ ఆడిన తీరు ఏమాత్రం బాలేదు. నెదర్లాండ్స్‌పై కేవలం 16 పరుగుల తేడాతో మాత్రమే పాక్ గెలుపొందింది. పైగా పాక్ సీనియర్లతో కూడిన జట్టును బరిలోకి దింపితే.. నెదర్లాండ్స్ దాదాపు 'B' టీంలో ఆడింది. ప్రస్తుతం చాలా మంది నెదర్లాండ్స్ ఆటగాళ్లు ప్రస్తుతం ఇంగ్లాండ్‌లోని ది హండ్రెడ్ లీగ్‌లో ఆడుతున్నారు. పాకిస్తాన్ బ్యాటింగ్‌లో మిడిలార్డర్ బలహీనంగా ఉందని భారత్‌తో సహా ఇతర జట్ల బౌలర్లకు కూడా తెలుసు.' అని కనేరియా చెప్పాడు.

సంవత్సరాలుగా చెబుతున్నా పట్టించుకోవట్లే
రొటేషన్ పాలసీతో బ్యాకప్ టీమ్‌ను రూపొందించేందుకు భారత్ కృషి చేస్తోంటే.. పాకిస్థాన్ మాత్రం అన్ని సిరీస్లకు సీనియర్ ప్లేయర్లనే ఆడిస్తుందని కనేరియా చెప్పాడు. టీ20ప్రపంచకప్ 2021 తర్వాత పాకిస్థాన్ 'బి' టీంను రూపొందించకుండా కాలాన్ని వృధా చేసిందని కనేరియా తెలిపారు. పాకిస్థాన్ క్రికెట్ భవిష్యత్తు కోసం బీ టీం నిర్మించాలని నేను చాలా సంవత్సరాలుగా చెబుతున్నాను. ప్రతి ఒక్క టీం తమ బీ జట్టును సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ఫ్రాంచైజీ క్రికెట్, అంతర్జాతీయ క్రికెట్ చాలా జరుగుతోంది. కాబట్టి మనకంటూ ఓ బ్యాకప్ టీం లేదా ఆటగాళ్ల రొటేషన్ అవసరం. మీరు ఏడాది పొడవునా ఒక విధమైన క్రికెటర్లతో ఆడితే వాళ్లకు భారం అవుతుంది. అలాగే వాళ్లు గాయాల బారిన పడి జట్టును కూడా దెబ్బతీస్తుంది.' అని డానిష్ కనేరియా చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications