న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బుమ్రా మాత్రమే అద్భుతాలు చేయగలడనుకుంటున్నాడు, ద్రావిడ్ మీద డానిష్ కనేరియా ఘాటు కామెంట్లు

Danish Kaneria Questions To Coach Dravid on Teamindia Playing 11 Selection

ఇంగ్లాండ్ - భారత్‌ జట్ల మధ్య జరుగుతున్న ఐదో టెస్టుకు వెటరన్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ను ఎంచుకోకపోవడం పట్ల పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ డానిష్‌ కనేరియా విమర్శలు గుప్పించాడు. అశ్విన్‌ను టీంలో ఇంక్లూడ్ చేయకపోవడాన్ని ప్రస్తావిస్తూ.. ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రావిడ్‌‌ను విమర్శించాడు. 35ఏళ్ల అశ్విన్.. టెస్ట్ బౌలర్ల లిస్టులో అలాగే ల్‌రౌండర్ల లిస్టులో ప్రస్తుతం రెండో ర్యాంకులో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

ఇక అశ్విన్ రీషెడ్యూల్ టెస్ట్ మ్యాచ్ కోసం భారత ప్లేయింగ్ 11లో ఎంపిక కాలేదు. అలాగే 2021-22లో భారత పర్యటనలో అతనికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. ఈ మ్యాచ్ విషయానికొస్తే.. రవిచంద్రన్ అశ్విన్ లేని లోటు స్పష్టంగా కన్పించింది. బ్యాటింగ్లో విలువైన పరుగులు చేయడంతో పాటు.. బౌలింగ్లో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనను అశ్విన్ చేయగలడు.

అయిదో టెస్ట్ ఆడుతున్న భారత బౌలర్లలో రెండో ఇన్నింగ్స్‌లో షమీ, బుమ్రా తప్పా మిగతా బౌలర్లు ప్రభావవంతంగా వేయలేకపోతున్నారు. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 245పరుగులు మాత్రమే చేయడంతో 378పరుగుల ఛేదించగల లక్ష్యం ఇంగ్లాండ్ ముందుంది. ఇక ఈ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ అలవోకగా ఛేదిస్తుంది.

అలెక్స్ లీస్ (56), జాక్ క్రాలే (46) తొలి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యాన్ని ఇవ్వగా తర్వాత జో రూట్ (76*) , జానీ బెయిర్‌స్టో (72*) నాలుగో రోజు వికెట్ కాపాడకుండా ఆడి స్కోరు బోర్డును 259కి చేర్చారు. ఫలితంగా 119పరుగుల లక్ష్యంతో అయిదోరోజు ఇంగ్లాండ్ బరిలోకి దిగింది. ఈ లక్ష్యాన్ని అత్యంత ఈజీగా వీరిద్దరు ఛేదిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌కు అశ్విన్‌ను ఎంపిక చేయకపోవడాన్ని కనేరియా తీవ్రంగా తప్పుబట్టాడు.

'ఎడ్జ్‌బాస్టన్‌లో గెలవాల్సిన పరిస్థితి నుంచి ఓడిపోయే పరిస్థితికి టీమిండియా చేరుకుంది. అసలు టీమిండియా ప్లేయింగ్ 11లో ఎందుకు రవిచంద్రన్ అశ్విన్ లేడు. ప్రస్తుతం కోచ్‌గా ఉన్న ద్రావిడ్‌.. గతంలో ఇంగ్లాండ్‌లో చాలా మ్యాచ్‌లు ఆడాడు. అతనికి తెలీదా? వేసవిలో ఇంగ్లాండ్ పిచ్‌లు పొడిగా ఉంటాయని? 3వ రోజు బంతి మరింత స్పిన్ అవుతుంది.. కేవలం బుమ్రా మాత్రమే అద్భుతాలు చేయగలడని ద్రావిడ్ చూస్తున్నాడు. భారత్ పొరపాటు చేసి భారీ మూల్యం చెల్లించుకుంది' అని కనేరియా కూ యాప్‌లో పేర్కొన్నాడు.

Story first published: Tuesday, July 5, 2022, 15:56 [IST]
Other articles published on Jul 5, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X