Danish Kaneria : సూర్యకుమార్ బ్యాటింగ్‌కు.. కోహ్లీ, బాబర్ లాంటి తోపులు సైతం జాన్తా నై

హైదరాబాద్‌లో జరిగిన ఆసీస్ వర్సెస్ ఇండియా డిసైడర్ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ వీరవిహారం చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ ఆస్ట్రేలియాను ఓడించి 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. సూర్యకుమార్ యాదవ్ తాజా ప్రదర్శనకు అభిమానులు, మాజీ క్రికెటర్ల నుంచి ప్రశంసలు అందాయి.
మాజీ పాకిస్తాన్ స్పిన్నర్ డానిష్ కనేరియా సైతం సూర్యను ఆకాశానికెత్తేశాడు. ప్రస్తుతం సూర్య బ్యాటింగ్‌ను చూస్తుంటే మిగతావాళ్లందరూ అతని తర్వాతే అనే స్థాయిలో ఉంది. 'నేను కొంతకాలం నుంచి చెబుతున్నదిదే. సూర్యకుమార్ అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడు. అతను తన 360డిగ్రీల బ్యాటింగ్ నైపుణ్యంతో ఆకట్టుకుంటున్నాడు. అతను బ్యాటింగ్ చేసే విధానం.. చూస్తుంటే తానో మాస్టర్ క్లాస్ క్రికెటర్ అని తానే ప్రకటించుకున్నట్లు ఉంటుంది. ఆసీస్‌తో చివరిదైన మూడో టీ20లో అతను అద్భుతంగా రాణించాడు.

అంతటి ఘనుడు
'అతను తన ఆటలో భిన్నమైన విధానాన్ని కలిగి ఉన్నాడు. అతను కచ్చితంగా చాలా పెద్ద ప్లేయర్ అవుతాడు. అతను బ్యాటింగ్ చేసే విధానం చూస్తుంటే ఇతర బ్యాటింగ్ దిగ్గజాలందరినీ మరచిపోతం. అంతటి ఘనుడు సూర్య. కోహ్లీ చాలా రన్స్ చేస్తాడు. బాబర్ కూడా బానే రాణిస్తాడు. కానీ సూర్య బ్యాటింగ్ చూశాక కోహ్లీ, బాబర్ వీళ్లెవరు గుర్తుకు కూడా రారు. సూర్య తర్వాతే వీళ్లందరు' అని తన యూట్యూబ్ ఛానెల్‌లో డానిష్ కనేరియా పేర్కొన్నాడు.

ఇండియాకు ఆయుధంలా మారిన సూర్య
ఇంగ్లాండ్‌లో భారత పర్యటించినప్పుడు జట్టులో స్థిరమైన ప్రదర్శనతో సూర్య ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. నంబర్ 4స్థానంలో ఇండియాకు సూర్య ఓ ఆయుధంలా మారాడు. మొన్నటి మ్యాచ్‌లో 36 బంతుల్లో 69పరుగులతో అతని అటాకింగ్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. అతను విరాట్‌తో కలిసి 104పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కోహ్లీ సైతం 48బంతుల్లో 63పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కెరీర్లో కోహ్లీ తన 33వ టీ20 హాఫ్ సెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు. ఇక కోహ్లీ ఔటయ్యే టైంకి దాదాపు ఇండియా విజయం ఖరారైంది. చివర్లో హార్దిక్ పాండ్యా ఫోర్ బాది విజయ లాంఛనాన్ని ముగిస్తాడు. భారత్ నేటి నుంచి దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనుంది. టీ20 ప్రపంచకప్ ముందు భారత్ ఆడబోయే చివరి టీ20 సిరీస్ ఇదే.

దక్షిణాఫ్రికా వర్సెస్ ఇండియా టీ20 సిరీస్ ఇరు జట్లు
భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యార్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), ఆర్.అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, ఉమేష్ యాదవ్, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా.
సౌతాఫ్రికా : టెంబా బావుమా (కెప్టెన్), క్వింటన్ డికాక్, రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఐడెన్ మార్క్‌రామ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎన్‌గిడి, అన్రిచ్ నార్జ్, వేన్ పార్నెల్, డ్వైన్ ప్రిటోరియస్, కగిసో రబాడా, రివైస్ రబాడా, ట్రిస్టన్ స్టబ్స్, బ్జోర్న్ ఫోర్టుయిన్, మార్కో జాన్సెన్, ఆండిలే ఫెహ్లుక్వాయో
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications