Danish Kaneria : రిషబ్ పంత్, బుమ్రా కెప్టెన్‌గా వద్దే వద్దు.. అయితే కోహ్లీని లేకుంటే ఆ ఇద్దరిలో ఒకరిని చేయండి

భారత జట్టు కెప్టెన్‌గా కావడానికి రిషబ్ పంత్‌కు ఉన్న మెచురిటీ సరిపోదని పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా పేర్కొన్నాడు. ఇంగ్లాండ్‌తో రీషెడ్యూల్డ్ టెస్ట్ కోసం కరోనా బారిన పడ్డ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉంటాడో ఉండడో అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. దీంతో రోహిత్ అందుబాటులో ఉండకుంటే ఎవరు కెప్టెన్సీ వహిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ఇక భారత టెస్ట్ జట్టు కెప్టెన్సీ కోసం పరిశీలిస్తున్న పేర్లలో.. రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్, పుజారా పేర్లు వినిపిస్తున్నాయి. పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ కనేరియా తన యూట్యూబ్ ఛానెల్‌లో ఈ అంశంపై మాట్లాడుతూ.. రిషబ్ పంత్ భారత టెస్ట్ జట్టును నడిపించేంత పరిణతి సాధించలేదని చెప్పాడు.

స్లాండ్ ఇన్ కెప్టెన్‌గా కోహ్లీ బెటర్
ఇక రోహిత్ శర్మ గైర్హాజరీ అయితే స్టాండ్-ఇన్ కెప్టెన్‌గా ఉండటానికి విరాట్ కోహ్లీ రైట్ ఛాయిస్ అని డానిష్ పేర్కొన్నాడు. ఇక చివరిసారి ఇంగ్లాండ్‌లో సిరీస్ ఆడినప్పుడు కోహ్లీ కెప్టెన్సీ వహించడం మనం చూశాం. అప్పట్లో అతను సక్సెస్ కూడా అయ్యాడు. ఇక ప్రస్తుతం కెప్టెన్సీ పేర్లకు పరిశీలిస్తున్న వారి పేర్లలో కోహ్లీ పేరు ప్రస్తావనకు రాకపోవడం తనను ఆశ్చర్యపరిచిందని కనేరియా పేర్కొన్నాడు.

ఎదుర్కోబోయేది ఇంగ్లాండ్‌ను
కనేరియా తన యూట్యూబ్ ఛానల్లో అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ.. 'కెప్టెన్సీ విషయంలో ముగ్గురు నలుగురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కానీ విరాట్ కోహ్లి పేరు మాత్రం అందులో లేదు. కోహ్లీ పేరు సూచించకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. పంత్ పేరు ఉంది, జస్ప్రీత్ బుమ్రా పేరు ఉంది. బహుశా వారిలో ఎవరో ఒకరు నాయకత్వం వహించవచ్చు.
ఇక చటేశ్వర్ పుజారా చాలా కాలంగా ఇండియాకు ఆడుతున్నాడు. అతను జట్టులో అత్యంత సీనియర్ ప్లేయర్ కూడా. రోహిత్ శర్మ లేకపోతే అతను కూడా జట్టును నడిపించగలడు. నా మట్టుకు మాత్రం రోహిత్ గైర్హాజరీలో టీమిండియా కెప్టెన్‌గా అత్యుత్తమ ఎంపిక విరాట్ కోహ్లీ. మీరు అతడిని స్టాండ్ ఇన్ కెప్టెన్‌గా చేయొచ్చు. ఎందుకంటే ఎదుర్కోబోయేది ఇంగ్లాండ్‌ను. ఈ పరిస్థితుల్లో ప్రయోగాల కన్నా ప్రాధమ్యాలే ముఖ్యం. ఇక రవిచంద్రన్ అశ్విన్ పేరు కూడా కెప్టెన్సీ విషయంలో వినిపిస్తుంది.' అని కనేరియా పేర్కొన్నాడు.

దక్షిణాఫ్రికా సిరీస్లో పంత్ ఏం చేశాడో మనం చూశాం
'ఈ నెల ప్రారంభంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన పంత్ ఏం చేశాడో చూశాం. కెప్టెన్‌గా ఎంపికయ్యాక 24ఏళ్ల పంత్ తన బ్యాటింగ్ ఫామ్‌ను కోల్పోయాడు. రిషబ్ పంత్ ఇకపై కెప్టెన్‌గా ఉండకూడదు. అతని కంటే నా ప్రకారం రవిచంద్రన్ అశ్విన్ బెటర్. ఇక బుమ్రాను కూడా కెప్టెన్‌గా చేయొద్దు. ఎందుకంటే ఇంగ్లాండ్ పిచ్‌లలో అతనిపై బౌలింగ్ భారం చాలా వరకు ఉంటుంది. అతను తన ఫోకస్ బౌలింగ్ పైనే పెట్టాలి. టెస్టు క్రికెట్ కాబట్టి బుమ్రా, పంత్ కెప్టెన్‌గా వద్దే వద్దు' అని కనేరియా పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications