For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గిఫ్ట్‌లు ఇచ్చి కాకా పట్టేవాళ్లకే పాకిస్థాన్ జట్టులో చోటు : సెలక్షన్‌పై డానిష్ కనేరియా సంచలన వ్యాఖ్యలు

Danish Kaneria has alleged that only those who give gifts can find a place in the Pak Team

శ్రీలంకతో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) 18మంది సభ్యులతో కూడిన జట్టును బుధవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సెలెక్షన్ పట్ల పాక్ మాజీ లెగ్ స్పిన్నర్ డానిష్ కనేరియా జాతీయ సెలక్షన్ కమిటీపై తీవ్ర విమర్శలు గుప్పించాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్టు సిరీస్‌లో ఆడిన ఆఫ్ స్పిన్నర్ సాజిద్ ఖాన్‌ను తప్పించి ఆ స్థానంలో యాసిర్ ఖాన్‌ను తీసుకోవడాన్ని తప్పుపట్టాడు. సెలక్షన్ కమిటీ ఏ ప్రాతిపదికన ఈ మార్పులు చేసిందో తనకు అర్థం కావడం లేదని, సాజిద్‌ను జట్టులో ఉంచాల్సిందని కనేరియా పేర్కొన్నాడు.

 సాజిద్ ఖాన్‌కు అన్యాయం చేశారు

సాజిద్ ఖాన్‌కు అన్యాయం చేశారు

కనేరియా తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ.. 'సెలక్టర్లు ఏ ప్రాతిపదికన జట్టును ఎంచుకున్నారో నాకైతే అర్థం కావడం లేదు. పాక్ సెలెక్టర్లు ఎప్పటికీ మారరు. జట్టును ఎంచుకునే టైంలో ఆటగాళ్ల గురించి అస్సలు ఆలోచించరు. పీసీబీ చీఫ్ రమీజ్ రాజా ఈ జట్టును ఎలా ఆమోదించాడో నాకైతే అంతు పట్టడం లేదు. ఆస్ట్రేలియా జట్టు పాకిస్థాన్ గడ్డ మీద పాకిస్థాన్‌ను ఓడించిన తర్వాత కొన్ని మార్పులు అవసరం కరెక్టే. కానీ ఆఫ్ స్పిన్నర్ సాజిద్ ఖాన్ ఆస్ట్రేలియాతో అన్ని టెస్ట్ మ్యాచ్‌ల్లో ఆడాడు. అతను ఎంతో కొంత ఆస్ట్రేలియన్లను ఎదుర్కొన్నాడు. అతన్నెలా తప్పిస్తారు. సాజిద్‌కు అన్యాయం జరిగింది' అని డానిష్ కనేరియా విమర్శలు గుప్పించాడు. ఇకపోతే దాదాపు 10నెలల పాటు జాతీయ జట్టు సెటప్‌కు దూరంగా ఉన్న వెటరన్ లెగ్ స్పిన్నర్ యాసిర్ షాను పాకిస్థాన్ సెలెక్షన్ కమిటీ తిరిగి జట్టులోకి ఆహ్వానించింది. ఇకపోతే డొమెస్టిక్ సర్క్యూట్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసిన తర్వాత అన్‌క్యాప్డ్ ఆల్ రౌండర్ అఘా సల్మాన్‌ను కూడా జట్టులోకి తీసుకుంది.

అతనికంటే కుర్రాడిని సెలెక్ట్ చేయొచ్చుగా..

అతనికంటే కుర్రాడిని సెలెక్ట్ చేయొచ్చుగా..

ప్రస్తుతం ఎంపిక చేసిన జట్టులో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌కు చోటు దక్కడం ఆశ్చర్యకరమని డానిష్ కనేరియా అభిప్రాయపడ్డాడు. 35 ఏళ్ల వికెట్ కీపర్ కం బ్యాటర్ అయిన సర్ఫరాజ్ అహ్మద్ 49 టెస్టు మ్యాచ్‌ల్లో 36.39 సగటుతో 2657 పరుగులు చేశాడు. చివరిసారిగా 2019జనవరిలో రెడ్ బాల్ క్రికెట్ ఆడాడు. ఇకపోతే పాక్ స్టార్ ప్లేయర్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ శ్రీలంకతో రెండు టెస్టు మ్యాచ్‌ల్లోనూ ఆడడం ఖాయం. అలాంటప్పుడు సెలక్షన్ కమిటీ సర్ఫరాజ్ కంటే యువ ఆటగాడికి అవకాశం ఇచ్చి ఉండాల్సిందని డానిష్ కనేరియా పేర్కొన్నాడు.

 బహుమతులు ఇచ్చినోళ్లకే ప్రిఫరెన్స్

బహుమతులు ఇచ్చినోళ్లకే ప్రిఫరెన్స్

'పాకిస్తాన్ దేశ జాతీయ క్రికెట్ భవిష్యత్తు కోసం ఒక జట్టును తయారు చేయాలి.. కానీ ప్రస్తుత సెలక్షన్ కమిటీ ఆ పని చేయలేదు. కొందరికి వంత పాడినట్లు స్పష్టంగా కన్పిస్తోంది. బహుమతులు, విందులు ఇచ్చి సెలెక్టర్లను సంతోషపెట్టే ప్లేయర్లు జట్టులోకి ఈజీగా వచ్చేస్తున్నారు. కష్టపడి శ్రమించే, నిజాయితీ గల ఆటగాళ్లకు అన్యాయం జరుగుతోంది' అంటూ డానిష్ కనేరియా పాక్ సెలెక్షన్ కమిటీని దెప్పి పొడిచాడు.

శ్రీలంక టెస్టులకు పాకిస్థాన్ జట్టు

శ్రీలంక టెస్టులకు పాకిస్థాన్ జట్టు

బాబర్ అజామ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), అబ్దుల్లా షఫీక్, అజర్ అలీ, ఫహీమ్ అష్రఫ్, ఫవాద్ ఆలం, హరీస్ రవూఫ్, హసన్ అలీ, ఇమామ్-ఉల్-హక్, మహ్మద్ నవాజ్, నసీమ్ షా, నౌమన్ అలీ, సల్మాన్ అలీ అఘా, సర్ఫరాజ్ అహ్మద్ (వికెట్ కీపర్), సౌద్ షకీల్, షాహీన్ ఆఫ్రిది, షాన్ మసూద్ మరియు యాసిర్ షా

Story first published: Thursday, June 23, 2022, 19:58 [IST]
Other articles published on Jun 23, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+