
అమీర్.. బ్లాక్ మెయిల్ చేస్తున్నావా
పాక్ వివాదాస్పద స్పిన్నర్ డానిష్ కనేరియా తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ... 'నేను మహ్మద్ అమీర్‌ని తప్పుబట్టడం లేదు. కాకపోతే ప్రతి ఒక్కరూ వాళ్ల అభిప్రాయాన్ని చెప్పొచ్చు. అమీర్ తన స్టేట్‌మెంట్స్ ద్వారా ఇతరుల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని నాకు అనిపిస్తోంది. తద్వారా మళ్లీ పాక్ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వడం అతని ఆలోచన కావొచ్చు. ఈ క్రమంలో ఇంగ్లండ్‌కి వెళ్లి.. అక్కడ బ్రిటీష్ సిటిజన్‌షిప్‌ని తీసుకుని ఐపీఎల్‌లో ఆడతానని చెప్తున్నాడు. దీనిబట్టి అతని ఆలోచన తీరుని మీరు అర్థం చేసుకోవచ్చు' అని అన్నాడు.

ఎడమచేతి వాటం బౌలర్లకి డిమాండ్
పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ అజహర్ మహ్మద్ కూడా బ్రిటీష్ సిటిజన్‌షిప్ తీసుకుని.. ఐపీఎల్‌లో ఆడాడు. పంజాబ్ కింగ్స్ తరఫున గతంలో అతడు మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్‌లో ఫాస్ట్ బౌలర్లకి.. మరీ ముఖ్యంగా ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్లకి మంచి డిమాండ్ ఉంది. మహ్మద్ అమీర్ ఎడమచేతి వాటం పేసర్ కాబట్టి మంచి ధర పలికే అవకాశం కూడా ఎక్కువే. అందుకే అమీర్ ఐపీఎల్ ఆడేందుకు ఆసక్తి చూపుతున్నాడు. సుదీర్ఘకాలంగా పాక్ క్రికెటర్లని ఐపీఎల్‌లోకి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అనుమతించని విషయం తెలిసిందే.
నేను కలిస్, వాట్సన్ లాంటివాడిని.. ఓపెనింగ్ చేస్తా, బౌలింగూ వేస్తా: విజయ్ శంకర్

ఏడాదిలోనే అత్యుత్తమ బౌలర్‌గా
2009లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన మహ్మద్ అమీర్.. ఏడాదిలోనే పాక్ అత్యుత్తమ బౌలర్‌గా ఎదిగాడు. ఎన్నో అద్భుత విజయాలు అందించాడు. అయితే 2010లో ఇంగ్లాండ్ పర్యటనలో స్ఫాట్ ఫిక్సింగ్‌కి పాల్పడి ఐదేళ్ల నిషేధం ఎదుర్కొన్నాడు. దాంతో అమీర్ కెరీర్ ముగిసిపోయిందని అంతా ఊహించారు.
కానీ 2015-2016లో మళ్లీ పాక్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన అమీర్.. అగ్రశ్రేణి బౌలర్‌గా ఎదిగాడు. గత ఏడాది అనూహ్యంగా టెస్టులకి రిటైర్మెంట్ ప్రకటించడం ద్వారా పాకిస్థాన్ క్రికెట్ పెద్దలకి కోపం తెప్పించాడు. అప్పటి నుంచి పీసీబీ నుంచి కూడా అతనికి మొండిచేయి ఎదురవుతూ వచ్చింది. పాక్ తరఫున 36 టెస్టులాడిన అమీర్ 119 వికెట్లు పడగొట్టాడు. 61 వన్డేల్లో 81 వికెట్లు, 50 టీ20ల్లో 59 వికెట్లు పడగొట్టాడు.

ఎస్సెక్స్ తరఫున ఆడుతూ ఫిక్సింగ్
ఇక 2000లో పాక్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన డానిష్ కనేరియా.. 61 టెస్టులు, 18 వన్డేలు ఆడి 276 వికెట్లు తీశాడు. పాకిస్థాన్ క్రికెట్‌లో కనేరియా ఓ బెస్ట్ స్పిన్నర్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ ఎలాంటి కారణం లేకుండానే పీసీబీ కనేరియాను జట్టు నుంచి తప్పించింది. జట్టులో చోటు కోసం చాలా రోజులు నిరీక్షించిన కనేరియా.. అవకాశం దక్కకపోవడంతో కౌంటీ క్రికెట్‌లో ఎస్సెక్స్ తరఫున ఆడటం మొదలు పెట్టాడు.2009లో డర్హామ్‌పై ఎసెక్స్ తరఫున ఆడుతున్నప్పుడు సహచర ప్లేయర్ మెర్విన్ వెస్ట్‌ఫీల్డ్‌తో కలిసి స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడు. అక్కడితో అతడి కెరీర్ ముగిసిపోయింది.


Click it and Unblock the Notifications












