For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ఎప్పుడూ రిజర్వ్‌ బెంచ్‌లోనే కూర్చోబెట్టేవాడు.. అఫ్రిది నా కెరీర్‌ను నాశనం చేశాడు'

Danish Kaneria Blames Shahid Afridi For Ruining His ODI Career

కరాచీ: లైఫ్‌టైమ్ నిషేధం ఎదుర్కొంటున్న పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా మరోసారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. తన కెరీర్‌ నాశనం కావడానికి మాజీ కెప్టెన్ షాహిద్‌ అఫ్రిదినే కారణమని ఆవేదన వ్యక్తం చేసాడు. అఫ్రిది కారణంగా తన కెరీర్‌ అర్థాంతరంగా ముగిసిపోయిందని విమర్శించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ముఖ్యంగా వన్డేలు ఎక్కువ ఆడకపోవడానికి.. అఫ్రిదికి తనపై ఉన్న చులకన భావనే కారణమని కనేరియా చెప్పుకొచ్చాడు.

ఎప్పుడూ రిజర్వ్‌ బెంచ్‌లోనే కూర్చోబెట్టేవాడు:

ఎప్పుడూ రిజర్వ్‌ బెంచ్‌లోనే కూర్చోబెట్టేవాడు:

39 ఏళ్ల డానిష్ కనేరియా కరాచీ నుండి పీటీఐతో మాట్లాడుతూ... 'దేశవాళీ క్రికెట్‌ నుంచి ఇద్దరం నేను, అఫ్రిది ఒకే జట్టుకు ఆడాం. అప్పుడే చాలా దారుణంగా వ్యహరించేవాడు. జాతీయ జట్టుకు వన్డేల్లో ఆడుతున్నప్పుడు కూడా అఫ్రిది నాకు వ్యతిరేకంగా ఉండేవాడు. ఒక వ్యక్తి ఎప్పుడూ వ్యతిరేకంగా ఉన్నాడంటే.. మతం తప్ప వేరే ఏ కారణం ఉండదు. ఎప్పుడూ నన్ను రిజర్వ్‌ బెంచ్‌లో కూర్చోబెట్టేవాడు. వన్డేల్లో ఎక్కువగా అవకాశాలు రాకుండా అడ్డుకున్నాడు. ఎప్పుడూ మిగతా క్రికెటర్లరు అఫ్రిది సపోర్ట్‌ చేస్తూ ఉండేవాడు. నాకు మాత్రం ఎప్పుడూ సహకరించలేదు' అని అన్నాడు.

నన్ను తొక్కేయాలని చూసేవాడు:

నన్ను తొక్కేయాలని చూసేవాడు:

'నేను పాకిస్తాన్‌ తరఫున క్రికెట్‌ బానే ఆడినందుకు ఆ దేవుడికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ప్రపంచ గర్వించే స్థాయిలో ఎదగలేకపోయినా ఆడినంతలో తృప్తిగానే ఉన్నా. నన్ను జట్టులో రెగ్యులర్‌ సభ్యుడు కాకుండా అఫ్రిది ఎప్పుడూ అడ్డుకునేవాడు. నేను ఒక లెగ్‌ స్పిన్నర్‌ని. అతను కూడా లెగ్‌ స్పిన్నర్‌ కావడంతో.. నన్ను తొక్కేయాలని చూసేవాడు. పాకిస్తాన్‌ తరఫున ఒక స్టార్‌ క్రికెటర్‌ కావడంతో నన్ను చులకనగా చూసేవాడు. తుది జట్టులో ఇద్దరు స్పిన్నర్లు ఉండాల్సిన అవసరం లేదని ఎప్పుడూ చెబుతూ ఉండేవాడు' అని కనేరియా పేర్కొన్నాడు.

నా ఫీల్డింగ్‌ను ఓ కారణంగా చూపేవాడు:

నా ఫీల్డింగ్‌ను ఓ కారణంగా చూపేవాడు:

'పరిమిత ఓవర్ల క్రికెట్‌లో నా ఫీల్డింగ్‌ను కూడా జట్టు నుండి తొలిగించడానికి ఓ కారణంగా చూపేవాడు. అఫ్రిది ఒక సుప్రీమ్‌ ఫిట్‌ లీడర్‌ అయితే.. నా ఫీల్డింగ్‌ను ఎత్తిచూపాలి. పాకిస్తాన్‌ క్రికెట్‌లో ఎప్పుడూ ఒకరిద్దరు మించి ఫీల్డర్లు ఉండేవారు కాదు. ఫీల్డింగ్‌ పరంగా మేము మెరుగైన జట్టేమీ కాదు. కానీ.. ఏదొక సాకుతో నన్ను రిజర్వ్‌ బెంచ్‌లో ఉంచేవాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో వన్డేలు ఎక్కువ ఆడకపోవడానికి అఫ్రిదినే కారణం' అని కనేరియా ఆవేదన వ్యక్తం చేశాడు. పాకిస్తాన్‌ తరఫున 61 టెస్టులు ఆడిన కనేరియా 261 వికెట్లు తీసాడు. 18 వన్డేలు ఆడి 15 వికెట్లు పడగొట్టాడు.

రక్తమోడుతున్నా బౌలింగ్‌ చేశా:

రక్తమోడుతున్నా బౌలింగ్‌ చేశా:

'నేను పదేళ్లు పాకిస్థాన్‌కు ఆడా అని అంటున్నారు. పదేళ్లు రక్తం ధారపోసి క్రికెట్‌కు సేవలందించా. క్రికెట్‌ కోసం నా రక్తాన్ని చిందించా. నా వేళ్లు రక్తమోడుతున్నా బౌలింగ్‌ చేశా. కానీ.. కొందరు డబ్బు కోసం దేశాన్ని తాకట్టుపెట్టి మరీ ఫిక్సింగ్‌ చేశారు. అయినా వారిని జట్టులోకి స్వాగతించారు. నేనెప్పుడూ డబ్బు కోసం నా దేశాన్ని తాకట్టు పెట్టలేదు' అని కనేరియా అన్నాడు.

Story first published: Saturday, May 16, 2020, 18:40 [IST]
Other articles published on May 16, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+