Danish Kaneria: రోహిత్ శర్మ ఎంత బాధ అనుభవించాడో నాకు తెలుసు.. అతన్ని ఇక ఆడనివ్వకండి

మూడో టీ20లో వెస్టిండీస్‌పై భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో వెన్నునొప్పితో కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. రెండో ఓవర్లో 11పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్‌గా డ్రెస్సింగ్ రూంకు వెళ్లిపోయాడు. ఆన్-సైడ్ వైపుకు స్వింగ్ చేసే ప్రయత్నంలో రోహిత్ దిగువ వీపులో గాయమైంది. అందువల్ల అతను నొప్పితో విలవిల్లాడాడు. ఇక చేసేదేం లేక అతను తన ఇన్నింగ్స్ మధ్యలోనే ముగించాల్సొచ్చింది. అతను లేకపోతేనేం ఓపెనర్ సూర్యకుమార్ యాదవ్ 76పరుగులతో ఎటాకింగ్ గేమ్ ఆడడంతో రోహిత్ లేని లోటు కన్పించలేదు. అలాగే రిషబ్ పంత్ సైతం 33పరుగులతో చివరి వరకు ఆడి భారత విజయ లాంఛనాన్ని ముగించాడు. ఇకపోతే రోహిత్ ఫ్లోరిడాలో లాడర్‌హిల్‌లో జరగబోయే నాలుగో టీ20కి అందుబాటులోకి రావొచ్చు. అతనికి అయిన గాయం అంత తీవ్రమైందేమీ కాదని.. సర్దుబాటు అయిందని జట్టు వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా మాత్రం రోహిత్ ఆడొద్దని అభిప్రాయపడ్డాడు.

రోహిత్ శర్మ లేకున్నా పోయేదేం లేదు
'రోహిత్ శర్మ ఆన్ సైడ్ బౌండరీ బాదినప్పుడు అతను ప్రతిస్పందించిన విధానం.. ఓ ఆటగాడిగా అతను ఎంత బాధ అనుభవించాడో నాకు తెలుసు. అతను తన ఫిట్‌నెస్‌కు ఇప్పుడు ప్రాధాన్యం ఇవ్వాలి. అతను తన తదుపరి రెండు గేమ్‌లకు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అతను లేకున్నా పోయేదేం లేదు. ఆసియా కప్, టీ20 ప్రపంచకప్‌లకు భారత జట్టుకు రోహిత్ శర్మ అవసరం. కాబట్టి అతను విశ్రాంతి తీసుకున్నా శ్రేయాస్ అయ్యార్, సంజూ శాంసన్, రిషబ్ పంత్ లాంటి ఓపెనింగ్ చేయగల సమర్థులు.. అలాగే కెప్టెన్సీ నిర్వహించడానికి మరికొందరు జట్టులో ఉన్నారు' అని కనేరియా తెలిపాడు. ఈ మేరకు యూట్యూబ్లో డానిష్ కనేరియా అభిప్రాయం వ్యక్తం చేశాడు.

నలువైపులా బౌండరీలు బాదుతూ రచ్చ
రోహిత్ ప్రారంభంలోనే నిష్క్రమించగా.. సూర్య యాదవ్ పూర్తి బాధ్యత తీసుకుని ఆడిన విధానం ఆకట్టుకుంది. అతను స్టేడియం నలువైపులా బౌండరీలు బాదుతూ రచ్చ లేపాడు. 4సిక్సర్లు, 8ఫోర్లతో బౌండరీలను మరో ఏబీ డివిలియర్స్ తరహాలో బాదాడు. శ్రేయస్ అయ్యర్‌తో కలిసి 86పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. తద్వారా మ్యాచ్ వన్ సైడ్ అయ్యేలా చేయగలిగాడు. ఇకపోతే డానిష్ కనేరియా సూర్యకుమార్ యాదవ్ స్ట్రోక్-ప్లే, సమర్థవంతమైన మణికట్టుతో బంతిని ఫ్లిక్ చేయగల అతని సమర్థతను కొనియాడాడు.

అతనిలా ఎవరూ ఆడలేరు
ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ టీ20 మెన్స్ ప్లేయర్ ర్యాంకింగ్స్‌లో టాప్ 2 ర్యాంక్‌లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అతను పాకిస్థాన్ స్టార్ బాబర్ ఆజామ్ కంటే రెండు రేటింగ్ పాయింట్లు మాత్రమే తక్కువగా ఉన్నాడు. ఈ సిరీస్ ముగిసే లోపు సూర్య నంబర్ 1 పొజిషన్లోకి చేరుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 'సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన క్లాసికల్ ప్లేయర్ అని మనందరికీ తెలుసు. కానీ మోడర్న్ క్రికెట్‌లో అతనిలాగా ఫ్లిక్ షాట్ ఆడేవారు ఎవరూ లేరు. అతను ఫ్లిక్‌లో తన మణికట్టును పైపైకి ఉపయోగించే విధానం అద్భుతం' అంటూ కనేరియా ప్రశంసించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications