Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రషీద్ ఖాన్‌తో నీ పెళ్లి ఎప్పుడు?: మహిళా క్రికెటర్ డానియెల్లి వాట్‌తో ఓ నెటిజన్

 Danielle Wyatt reverts wittily when asked about her wedding with Rashid Khan

హైదరాబాద్: రషీద్ ఖాన్... టీ20ల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్న ఆప్ఘనిస్థాన్ యువ స్పిన్నర్. 19 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లో రికార్డులను తిరిగరాస్తున్నాడు. ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రషీద్ ఖాన్ సంచలన బౌలర్‌గా మారాడు.

ఆప్ఘనిస్థాన్ క్రికెట్‌కు దొరికిన గ్రేటెస్ట్ స్పిన్నర్. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న టీ20 టోర్నీలో రషీద్ ఖాన్ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ప్రస్తుతం రషీద్ ఖాన్ ఇంగ్లాండ్ టీ20 బ్లాస్ట్‌లో ససెక్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో రషీద్ ఖాన్ ససెక్స్ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్లు సైతం రషీద్ ఖాన్‌ ఆటతీరుకు ముగ్దులవుతున్నారు. సోషల్ మీడియాలో నిత్యం అభిమానులతో టచ్‌లో ఉండే ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ డానియెల్లి వాట్ కూడా రషీద్ ఖాన్‌కు పెద్ద అభిమాని.

ఐపీఎల్ 2018లో ముంబైలో ప్లేఆఫ్స్ జరిగే సమయంలో రషీద్ ఖాన్‌ను వ్యక్తిగతంగా డానియెల్లి వ్యాట్ కలిసిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఏ లీగ్‌లో రషీద్ ఖాన్‌ ఆడుతున్నా... అతడి బౌలింగ్‌పై ఏదో ఒక కామెంట్ డానియెల్లి వాట్ చేస్తూనే ఉంటుంది.

తాజాగా ఇంగ్లాండ్ టీ20 బ్లాస్ట్ టోర్నీలో భాగంగా ససెక్స్-ఎసెక్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో రషీద్ ఖాన్ 4 ఓవర్లు వేసి 25 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. కీలక సమయంలో ఎసెక్స్ జట్టు ఓపెనర్ వరుణ్ చోప్రా, ఆల్ రౌండర్ రవి బొపారా వికెట్లను తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

ఈ మ్యాచ్‌‌లో ససెక్స్ జట్టు 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం ససెక్స్ క్రికెట్ తన అధికారిక ట్విట్టర్‌లో రషీద్ ఖాన్ ఎసెక్స్ జట్టు ఆటగాడు వరుణ్ చోప్రా వికెట్ తీసిన వీడియోని అభిమానులతో పంచుకుంది. ఈ వీడియోని వీక్షించిన వాట్ 'యస్ ఔట్' అంటూ రిప్లై ఇచ్చింది.

అదే సమయంలో అబ్దుల్ బాసిత్ నదీమ్ అనే నెటిజన్ 'రషీద్ ఖాన్‌ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావ్' అని డానియెల్లి వాట్‌ను ప్రశ్నించాడు. అయితే ఆ తుంటరి నెటిజన్ ప్రశ్నకు గాను డానియెల్లి వాట్ నవ్వుతున్న ఎమోజీలను పోస్టు చేస్తూ రిప్లై ఇచ్చింది.

Story first published: Wednesday, July 11, 2018, 18:20 [IST]
Other articles published on Jul 11, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+