Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఏపీఎల్: రషీద్ ఖాన్ వీరవిహారంపై చీకి మేసెజ్ పెట్టిన డానియెల్లి వాట్

Danielle Wyatt had a cheeky message for Rashid Khan after he goes berserk in APL

హైదరాబాద్: ఆప్ఘనిస్థాన్ స్పిన్ సంచనలం రషీద్ ఖాన్‌ను 'స్లోగెర్' అంటూ కామెంట్ చేసింది ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ డానియెల్లి వాట్. ప్రస్తుతం షార్జా వేదికగా జరుగుతున్న ఆప్ఘనిస్థాన్ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)లో రషీద్ ఖాన్ తనదైన శైలిలో రెచ్చిపోతున్నాడు. ఈ లీగ్‌లో కాబుల్ జవానన్ జట్టుకు సారథ్యం వహిస్తోన్న రషీద్ ఖాన్ ఆదివారం బల్క్ లెజెండ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో వీరవిహారం చేశాడు.

ఈ మ్యాచ్‌లో రషీద్ ఖాన్ 27 బంతుల్లో 56 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో రషీద్ ఖాన్ నాయకత్వంలోని కాబుల్ జవానన్ జట్టు ప్రత్యర్ధి జట్టుపై 8 వికెట్లు తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రవి బొపారా వేసిన 19వ ఓవర్‌లో రషీద్ ఖాన్ నాలుగు సిక్సులు, ఒక ఫోర్ బాదాడు. ఇందుకు సంబంధించిన వీడియోని రషీద్ ఖాన్ తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్నాడు.

ఈ వీడియోని వీక్షించిన ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ డానియెల్లి వాట్ వెంటనే తనదైన శైలిలో స్పందించింది. ట్విట్టర్‌లో రషీద్ ఖాన్‌ని ఉద్దేశించి 'slogerrrrrrr' అంటీ ట్వీట్ చేసింది. అయితే, డానియెల్లి వాట్ పురుష క్రికెటర్లను ఉద్దేశించి ట్వీట్ చేయడం ఇదే మొదటిసారి కాదు. నిజానికి డానియెల్లి వాట్ కూడా రషీద్ ఖాన్‌కు పెద్ద అభిమాని.

గతంలో రషీద్ ఖాన్ ఇంగ్లాండ్‌ కౌంటీ జట్టు అయిన ససెక్స్‌కు తరుపున ఆడిన సమయంలో ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్లు సైతం రషీద్ ఖాన్‌ ఆటతీరుకు ముగ్దులయ్యారు. ఈ క్రమంలో రషీద్ ఖాన్ బౌలింగ్‌పై కామెంట్ చేసింది. అప్పట్లో ఇంగ్లాండ్ టీ20 బ్లాస్ట్ టోర్నీలో భాగంగా ససెక్స్ జట్టు తరుపున ఆడిన రషీద్ ఖాన్ 4 ఓవర్లు వేసి 25 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు.

Danielle Wyatt had a cheeky message for Rashid Khan after he goes berserk in APL

కీలక సమయంలో ఎసెక్స్ జట్టు ఓపెనర్ వరుణ్ చోప్రా, ఆల్ రౌండర్ రవి బొపారా వికెట్లను తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌‌లో ససెక్స్ జట్టు 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం ససెక్స్ క్రికెట్ తన అధికారిక ట్విట్టర్‌లో రషీద్ ఖాన్ ఎసెక్స్ జట్టు ఆటగాడు వరుణ్ చోప్రా వికెట్ తీసిన వీడియోని అభిమానులతో పంచుకుంది. ఈ వీడియోని వీక్షించిన వాట్ 'యస్ ఔట్' అంటూ రిప్లై ఇచ్చింది.

అదే సమయంలో అబ్దుల్ బాసిత్ నదీమ్ అనే నెటిజన్ 'రషీద్ ఖాన్‌ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావ్' అని డానియెల్లి వాట్‌ను ప్రశ్నించాడు. అయితే ఆ తుంటరి నెటిజన్ ప్రశ్నకు గాను డానియెల్లి వాట్ నవ్వుతున్న ఎమోజీలను పోస్టు చేస్తూ రిప్లై ఇచ్చింది. ఐపీఎల్ 2018లో ముంబైలో ప్లేఆఫ్స్ జరిగే సమయంలో రషీద్ ఖాన్‌ను వ్యక్తిగతంగా డానియెల్లి వ్యాట్ కలిసింది.

Story first published: Tuesday, October 9, 2018, 15:10 [IST]
Other articles published on Oct 9, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+