న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ ఇచ్చిన బ్యాట్‌తో ప్రాక్టీస్: తన వల్ల కాదంటున్న డానియెల్లి

డానియెల్లి యాట్‌... ఇంగ్లండ్ వేదికగా ముగిసిన ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్‌ గెలిచిన జట్టులో సభ్యురాలు. ఇంతకుముందు 2014 వరల్డ్ టీ20 జరిగిన సందర్భంలో విరాట్ కోహ్లీ నన్ను పెళ్లి చేసుకుంటావా?

By Nageshwara Rao

హైదరాబాద్: డానియెల్లి యాట్‌... ఇంగ్లండ్ వేదికగా ముగిసిన ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్‌ గెలిచిన జట్టులో సభ్యురాలు. ఇంతకుముందు 2014 వరల్డ్ టీ20 జరిగిన సందర్భంలో విరాట్ కోహ్లీ నన్ను పెళ్లి చేసుకుంటావా? అని సోషల్ మీడియాలో అడిగి అప్పట్లో వార్తల్లో నిలిచింది.

అయితే తాజాగా డానియెల్లి మరో ట్వీట్‌‌తో మళ్లీ వార్తల్లో నిలిచింది. అది కూడా కోహ్లీకి సంబంధించిన ట్వీటే కావడం విశేషం. 2014లో ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా కోహ్లీ నుంచి కానుకగా అందుకున్న బ్యాట్‌కు సంబంధించిన ఫొటోని డానియెల్లి ట్విట్టర్‌లో పోస్టు చేసింది.

Danielle Wyatt excited to train with the bat Virat Kohli gifted her

యాషెస్‌ సిరీస్‌కు సన్నద్ధమయ్యేందుకు డానియెల్లి తిరిగి శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటోంది. 'ఈ వారం తిరిగి శిక్షణలో పాల్గొంటున్నాను. ఈ బ్యాట్‌ ఉపయోగించేందుకు వేచి ఉండటం నా వల్ల కాదు. థాంక్స్‌ కోహ్లీ' అని కామెంట్ పోస్టు చేసి అభిమానులతో పంచుకుంది.

2014లో భారత్ ఇంగ్లండ్‌లో పర్యటించిన సందర్భంలో వీరిద్దరూ కలిసి ఫోటోలు కూడా దిగారు. అప్పుడే కోహ్లీ తన బ్యాట్‌ను డానియెల్‌కు కానుకగా ఇచ్చాడు. 18 ఏళ్ల వయసులో 2010లో ఇంగ్లండ్ తరుపున ముంబైలో జరిగిన ఓ మ్యాచ్‌లో డానియెల్‌ అంతర్జాతీయ అరంగేట్రం చేసింది.

26 ఏళ్ల డానియెల్‌ ఇంగ్లండ్ తరుపున ఇప్పటివరకు 53 వన్డేలు, 70 టీ20 మ్యాచ్‌లు ఆడింది. వన్డేల్లో 26.59 యావరేజితో 27 వికెట్లు తీసింది. ఇక టీ20ల్లో 14.58 యావరేజితో 46 వికెట్లు తీసింది. అయితే ఇప్పటివరకు ఇంగ్లండ్ తరుపున టెస్టు క్రికెట్‌ ఆడక పోవడం విశేషం.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X