INDvsAUS : కోహ్లీని అలా అవుట్ చేశాడంటే.. అతని సత్తా తెలియడం లేదా?

టీమిండియా సూపర్ స్టార్ కోహ్లీ ఎంత గొప్ప క్రికెటరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత మూడేళ్లుగా ఫామ్‌లో లేకపోయినా కూడా కోహ్లీ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. ఈ ఏడాది ఆరంభంలో మళ్లీ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తను ఫామ్‌లోకి వచ్చినట్లు ఘనంగా చాటాడీ స్టార్ ప్లేయర్. అయితే టెస్టుల్లో మాత్రం అతని పేలవ ఫామ్ కొనసాగుతూనే ఉంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పెద్దగా రాణించడం లేదు.

కుర్రాడైనా సూపర్ బౌలర్..
ఇప్పటి వరకు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో జరిగిన మూడు టెస్టుల్లో కూడా కోహ్లీ మంచి స్కోర్ చెయ్యలేదు. ఢిల్లీలో తొలి ఇన్నింగ్స్‌లో చేసిన 44 పరుగులే అతని టాప్ స్కోర్. ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా యువ సంచలనం టాడ్ మర్ఫీ.. కోహ్లీని తెగ ఇబ్బంది పెడుతున్నాడు.
ఇప్పటికే కోహ్లీని అతను మూడుసార్లు అవుట్ చేయడం గమనార్హం. దీని గురించి ఆస్ట్రేలియా కోచింగ్ బృందంలో ఉన్న కివీస్ లెజెండ్ డానియల్ వెటోరీ కీలక వ్యాఖ్యలు చేశాడు. మర్ఫీ అద్భుతమైన బౌలర్ అని మెచ్చుకున్న అతను.. కోహ్లీని తొలిసారి స్టంపౌట్ చేశాడంటేనే మర్ఫీ సత్తా అర్థం అవుతుందని కొనియాడాడు.

కోహ్లీని అలా అవుట్ చేశాడంటే..
ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టెస్టులో విరాట్ కోహ్లీ ఫర్వాలేదనిపించాడు. ఆ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో మర్ఫీ బౌలింగ్‌లో కోహ్లీ స్టంపౌట్ అయ్యాడు. ఇలా టెస్టుల్లో క్రీజును వదిలి ముందుకు దూకి స్టంపౌట్ అవడం కోహ్లీకి ఇదే తొలిసారి. ఇదే విషయాన్ని చెప్పిన వెటోరీ.. ఈ ఒక్క అవుట్ చూస్తేనే మర్ఫీ ఎంత ట్యాలెంటెడ్ ఆటగాడో చెప్పొచ్చు అన్నాడు.
'స్టీవ్ స్మిత్ కూడా మర్ఫీ పెర్ఫామెన్స్‌ను మెచ్చుకున్నాడు. అతని స్పెల్ వల్లనే మిగతా బౌలర్లు వికెట్లు తీసుకోగలిగారు. ఢిల్లీలో తొలిసారి కోహ్లీ అతని బౌలింగ్‌లోనే స్టంపౌట్ అవడం అంటే మాటలు కాదు' అని చెప్పుకొచ్చాడు.

ఇలా రాణించడం మాటలు కాదు..
దేశవాళీల నుంచి సడెన్‌గా అంతర్జాతీయ క్రికెట్ ఆడాల్సి వస్తే చాలా మంది తడబడతారని, కానీ మర్ఫీకి మాత్రం ఈ మార్పు చాలా సహజంగా జరిగిందని కొనియాడాడీ కివీస్ మాజీ కెప్టెన్. 'ఇంత యువ స్పిన్నర్.. అనుభవం లేదు. దేశవాళీల్లో కూడా అంత ఎక్కువ ఆడలేదు. అలాంటి వాడిని తీసుకొచ్చి ఇలాంటి కఠినమైన పరిస్థితులు ఎదుర్కోవాలి అంటే ఎంత కష్టం? కానీ తనకు ఇచ్చిన పాత్రను మర్ఫీ చాలా చక్కగా నిర్వర్తించాడు' అని మెచ్చుకున్నాడు.
ఇండోర్‌లో కూడా ముగ్గురు స్పిన్నర్లతో బరిలో దిగిన ఆసీస్ అద్భుతంగా ఆడింది. ఈ క్రమంలోనే ఇండోర్ టెస్టులో తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications