Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సీపీఎల్: చీర్‌లీడర్స్‌తో కలిసి డ్యాన్స్ చేసిన షారుక్‌ (వీడియో)

Dancing in the face of CPL loss, Shah Rukh Khan shimmies with Caribbean cheerleaders

హైదరాబాద్: కరేబీయన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో బాలీవుడ్‌ బాద్‌షా షారుక్ ఖాన్‌ సందడి చేశాడు. టోర్నీలో భాగంగా శుక్రవారం జమైకా తలవాస్‌తో జరిగిన మ్యాచ్‌లో షారుక్ ఖాన్ హాజరై తన జట్టు ట్రిన్‌బాగో నైట్‌ రైడర్స్‌(టీకేఆర్‌)కు మద్దతుగా నిలిచాడు. కాగా, ఈ మ్యాచ్‌కు ముందు షారుక్ ఖాన్ చీర్‌లీడర్స్‌తో కలిసి డ్యాన్స్ చేశాడు.

ఇందుకు సంబంధించిన వీడియోని కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) తన అధికారిక ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రస్తుతం వెస్టిండీస్‌ కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 6వ సీజన్‌ జరుగుతోంది. ఆగస్టు 8న ప్రారంభమైన ఈ లీగ్‌ సెప్టెంబరు 16తో ముగియనుంది.

ఈ లీగ్‌లో మొత్తం 6 జట్లు తలపడుతున్నాయి. ట్రిబాగో నైట్‌రైడర్స్‌ జట్టుకు షారుక్‌ ఖాన్‌ సహ యజమానిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం ట్రిబాగో నైట్‌రైడర్స్‌- జమైకా తలవాస్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు షారుక్‌ ట్రినిడాడ్‌ వెళ్లాడు. మ్యాచ్‌కు ముందు షారుక్‌ మైదానంలో కలియ తిరుగుతూ అభిమానుల్లో ఉత్సాహం నింపాడు.

చీర్‌లీడర్స్‌తో కలిసి డ్యాన్స్ కూడా చేశాడు. కాగా, ఈ మ్యాచ్‌లో జమైకా తలవాస్‌ కెప్టెన్ ఆండ్రూ రస్సెల్‌ అద్భుత ప్రదర్శనతో ట్రిబాగో నైట్‌ రైడర్స్‌ నాలుగు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. కాగా, ఐపీఎల్‌లో కూడా షారుక్ ఖాన్‌కు ఓ ప్రాంఛైజీ ఉన్న సంగతి తెలిసిందే. ఆ జట్టు ఆడే మ్యాచ్‌లకు కుటుంబసభ్యులతో కలిసి హాజరై ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ కనిపిస్తాడు.

ట్రిబాగో నైట్‌రైడర్స్‌ ప్రమోషనల్‌ సాంగ్‌‌ని ట్విట్టర్‌లో విడుదల చేసిన బ్రావో
ఇక తమ జట్టు ప్రచార సాంగ్‌ను బ్రావో తన ట్విటర్‌ వేదికగా విడుదల చేశారు. టీకేఆర్‌ ప్రమోషన్‌ సాంగ్‌ను విడుదల చేస్తున్నానని, ఫ్రాంచైజీ యజమాని షారుఖ్‌ ఖాన్‌కు ధన్యవాదాలంటూ బ్రావో ట్విట్‌ చేశాడు. ఇక ఈ ప్రమోషన్‌ సాంగ్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Story first published: Saturday, August 11, 2018, 13:33 [IST]
Other articles published on Aug 11, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+