
భారత వీసాకు సంబంధించిన ఫొటో
భారత వీసాకు సంబంధించిన ఫొటోను డేల్ స్టెయిన్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో "అహ్హా.. ఏంటీ ఈ సర్‌ప్రైజ్" అనే క్యాఫ్షన్‌తో షేర్ చేశాడు. దీంతో అర్సీబీ అభిమానులు సంతోషపడుతున్నారు. ఐపీఎల్ 2019 సీజన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఎంతమాత్రం కలిసి రాలేదు. వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఓడటంతో ఆ జట్టు అభిమానులు డీలా పడిపోయారు.

పేలవంగా ఆర్సీబీ బౌలింగ్ విభాగం
ముఖ్యంగా ఈ సీజన్‌లో ఆర్సీబీ బౌలింగ్ విభాగం పేలవంగా తయారైంది. భారీ లక్ష్యాలను కూడా కాపాడుకోలేక ఆ జట్టు చేతులెత్తేసింది. ఇలాంటి సమయంలో డేల్ స్టెయిన్ జట్టులో చేరితే ఆర్సీబీకి కలుసోస్తుందని అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కాగా, డేల్ స్టెయిన్ చివరగా ఐపీఎల్ 2016 సీజన్‌లో గుజరాత్ లయన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు.

ఒకే ఒక్క మ్యాచ్ అడిన డేల్ స్టెయిన్
ఈ సీజన్‌లో స్టెయిన్ ఒకే ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు. ఇదిలా ఉంటే, 2008 సీజన్ నుంచి 2010 వరకు స్టెయిన్ ఆర్సీబీ జట్టుకే ప్రాతినిథ్యం వహించాడు. మొత్తం 28 మ్యాచ్‌లాడి 27 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత 2011లో డెక్కన్ చార్జెర్స్ తరపున... ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ లయన్స్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు.

2017 సీజన్ మొత్తానికి దూరం
భజం గాయం కారణంగా ఐపీఎల్ 2017 సీజన్ మొత్తానికి డేల్ స్టెయిన్ దూరమయ్యాడు. ఐపీఎల్ 2018 సీజన్ కోసం నిర్వహించిన వేలంలో డేల్ స్టెయిన్ ఒక్క ప్రాంఛైజీ కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తిని కనబర్చలేదు. కాగా, డేల్ స్టెయిన్ ఆర్సీబీ జట్టులో చేరే విషయమై యాజమాన్యం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.


Click it and Unblock the Notifications













