న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

డేల్ స్టెయిన్‌..గోల్డెన్ ఛాన్స్‌: ప్ర‌పంచ‌క‌ప్‌లో మాయం..అక్క‌డ ప్ర‌త్య‌క్షం!

 Dale Steyn Joins Euro T20 Slam

జొహాన్నెస్‌బ‌ర్గ్‌: ద‌క్షిణాఫ్రికా బౌలింగ్ తురుపుముక్క డేల్ స్టెయిన్ ఓ అద్భుత అవ‌కాశాన్ని చేజిక్కించుకున్నాడు. భుజంలో గాయం వ‌ల్ల ఒక్క మ్యాచ్ కూడా ఆడ‌కుండానే ప్ర‌పంచ‌క‌ప్ క్రికెట్ మెగా ఈవెంట్ నుంచి త‌ప్పుకొన్న స్టెయిన్‌.. మ‌ళ్లీ బంతి అందుకోబోతున్నాడు. యూరో టీ20 స్టామ్ టోర్న‌మెంట్‌కు ఎంపిక అయ్యాడు స్టెయిన్‌. ఈ టోర్న‌మెంట్ వ‌చ్చేనెల 30వ తేదీన ఆరంభం కానుంది. త‌మ దేశాల్లో క్రికెట్‌ను ప్రోత్స‌హించాల‌నే ఉద్దేశంతో నెద‌ర్లాండ్‌, స్కాట్లాండ్‌, ఐర్లాండ్ సంయుక్తంగా ఈ టోర్న‌మెంట్‌ను నిర్వ‌హించ‌నున్నాయి.

ఇటీవ‌లే దేశ‌వాళీ, అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికిన యువరాజ్ సింగ్ కూడా ఈ టోర్న‌మెంట్‌కు ఎంపిక అయ్యాడు. పాకిస్తానీ ఆట‌గాళ్లు షాహిద్ అఫ్రిదీ, బాబ‌ర్ ఆజ‌మ్‌, ఆస్ట్రేలియా స్పిన్ బౌల‌ర్ క్రిస్ లియాన్‌, న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్లు బ్రెండ‌న్ మెక్‌క‌ల్ల‌మ్‌, ల్యూక్ రోంకీ ఈ టోర్న‌మెంట్‌లో ఆడ‌బోతున్నారు.

ధోనీ నోటి నుంచి ర‌క్తం..!ధోనీ నోటి నుంచి ర‌క్తం..!

ఇవాన్ మోర్గాన్‌, జేపీ డుమిని, ఇమ్రాన్ తాహిర్‌, ర‌షీద్ ఖాన్ యూరో టీ20 స్టామ్ రేసులో ఉన్నారు. 93 టెస్టు మ్యాచుల్లో 439 వికెట్ల‌ను ప‌డ‌గొట్టిన డేల్ స్టెయిన్ ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌కు దూరం అయ్యాడు. 125 వ‌న్డేల్లో 196, 44 టీ20 మ్యాచుల్లో 61 వికెట్ల‌ను ప‌డ‌గొట్టాడత‌ను. డేల్ స్టెయిన్ గైర్హాజ‌రీలో ద‌క్షిణాఫ్రికా ప్ర‌పంచ‌క‌ప్‌లో ఎంత దారుణంగా ఆడిందో మ‌న‌కు తెలుసు. బంగ్లాదేశ్ వంటి టీమ్‌పైనా ఓట‌మి చ‌వి చూసింది ప్రొటీస్ టీమ్‌. 2015 ప్ర‌పంచ‌క‌ప్‌లో సెమీ ఫైన‌ల్‌లో హోరాహోరీగా త‌ల‌ప‌డిన ద‌క్షిణాఫ్రికా ఈ సారి మాత్రం లీగ్ ద‌శ‌లోనే వెనుదిరిగింది.

Story first published: Tuesday, July 2, 2019, 15:15 [IST]
Other articles published on Jul 2, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X