For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ20ల్లో స్టెయిన్‌ అరుదైన రికార్డు.. తాహీర్‌ రికార్డు బద్దలు!!

Dale Steyn becomes South Africas leading T20I wicket-taker in comeback match

ఈస్ట్‌లండన్‌ (దక్షిణాఫ్రికా): సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా బఫెల్లో పార్క్‌ వేదికగా బుధవారం రాత్రి జరిగిన తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఒక్క పరుగు తేడాతో అనూహ్య విజయం సాధించింది. చివరి ఓవర్‌లో ప్రొటీస్ స్టార్ పేసర్ లుంగి ఎంగిడి తన అద్భుత బౌలింగ్‌తో ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌ను గెలిపించాడు. దీంతో దక్షిణాఫ్రికా మ్యాచ్‌ను గెలిచి సిరీస్‌లో బోణీ కొట్టింది.

టీ20ల్లో అత్యధిక వికెట్లు

తొలి టీ20లో దాదాపు ఏడాది తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడుతున్న దక్షిణాఫ్రికా పేసర్‌ డేల్‌ స్టెయిన్‌ ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. అంతర్జాతీయ టీ20ల్లో దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్‌ వికెట్ కీపర్ జోస్‌ బట్లర్‌ వికెట్‌ను తీయడం ద్వారా ప్రొటీస్ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన రికార్డును స్టెయిన్‌ తన పేరిట లిఖించుకున్నాడు.

 తాహిర్ రికార్డు బ్రేక్‌:

తాహిర్ రికార్డు బ్రేక్‌:

జోస్‌ బట్లర్‌ వికెట్‌ను తీయడంతో వెటరన్ స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహిర్ రికార్డును స్టెయిన్‌ బ్రేక్‌ చేశాడు. దక్షిణాఫ్రికా తరఫున ఇప్పుటివరకూ తాహిర్ 61 టీ20 వికెట్లు సాధించగా.. స్టెయిన్‌ 62 వికెట్లతో బద్ధలు కొట్టాడు. 35 మ్యాచ్‌లలో తాహిర్ 61 వికెట్లు పడగొట్టగా.. స్టెయిన్ 45 మ్యాచ్‌లలో 62 వికెట్లు సాధించాడు. 46 వికెట్లతో మోర్నీ మోర్కెల్ మూడో స్థానంలో ఉన్నాడు.

టెస్టుల్లోనూ టాపే:

టెస్టుల్లోనూ టాపే:

దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక టెస్టు వికెట్ల రికార్డు కూడా స్టెయిన్‌ పేరిటే ఉన్న సంగతి తెలిసిందే. 439 టెస్టు వికెట్లు సాధించి సఫారీ జట్టు తరఫున అగ్రస్థానంలో ఉన్నాడు. 93 టెస్టుల్లో 439 వికెట్లు తీసిన స్టెయిన్‌.. 1251 పరుగులు సాధించాడు. టీ20ల్లో అత్యధిక వికెట్ల రికార్డు శ్రీలంక వెటరన్‌ పేసర్‌ లసిత్‌ మలింగ పేరిట ఉంది. మలింగ ఇప్పటివరకూ 106 అంతర్జాతీయ టీ20 వికెట్లు సాధించి తొలి స్థానంలో ఉన్నాడు. షాహిద్‌ ఆఫ్రిది (96), షకిబుల్‌ హసన్‌ (92)లు తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

అనూహ్య విజయం

అనూహ్య విజయం

తొలి టీ20లో దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్‌ చేసి 8 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. తెంబ బవుమా (43; 27 బంతుల్లో 5x4), కెప్టెన్‌ క్వింటన్‌ డికాక్‌ (31; 15 బంతుల్లో 3x4, 2x6) రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనలో ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ (70; 38 బంతుల్లో 7x4, 3x6), కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ (52; 34 బంతుల్లో 7x4, 1x6) ధాటిగా ఆడటంతో ఇంగ్లాండ్‌ సునాయాస విజయం సాధించేలా కనిపించింది. అయితే చివరి ఏడు బంతుల్లో ప్రొటీస్ బౌలర్లు పుంజుకుని అనూహ్య విజయాన్ని అందించారు.

Story first published: Thursday, February 13, 2020, 16:50 [IST]
Other articles published on Feb 13, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+