Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సోష‌ల్ మీడియాలో డేల్ స్టెయిన్ రిక్వెస్ట్.. ఆటాడుకుంటున్న నెటిజన్లు!!

Dale Steyn asks for help to edit false information about him on Wikipedia

హైదరాబాద్: 36 ఏళ్ల దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ డేల్ స్టెయిన్‌ అందరికి సుపరిచితమే. స్టెయిన్ 439 వికెట్లతో దక్షిణాఫ్రికా తరుపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. అయితే స్టెయిన్‌ సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉంటాడు. ఈ క్రమంలో మంగళవారం ఒక విష‌యంపై స‌హాయం కావాలంటూ సోష‌ల్ మీడియాలో స్టెయిన్ రిక్వెస్ట్ పెట్టగా.. నెటిజన్లు అతన్ని ఓ ఆటాడుకుంటున్నారు. విషయంలోకి వెళితే...

నా వికీపీడియాలో ఉన్న పేజీలో కొన్ని త‌ప్పులు ఉన్నాయి. ఆ తప్పులను స‌రిచేసేందుకు సాయం కావాలంటూ స్టెయిన్ ట్విట్ట‌ర్‌లో రిక్వెస్ట్ పెట్టాడు. ట్వీట్ చేసిన వెంటనే నెటిజ‌న్లు తమదైన స్థాయిల్లో స్టెయిన్‌ను ఓ ఆడుకుంటున్నారు. 'నీకంటే ఇంగ్లాండ్‌ పేసర్ జేమ్స్ అండ‌ర్స‌న్ గొప్ప బౌల‌ర్ అని ఆ పేజీలో పేర్కొన్నారా' అని ఒక నెటిజ‌న్ ట్వీట్ చేసాడు. 'ఎవరైనా నిన్ను ఐపీఎల్ టైటిల్ సాధించిన జట్టులో చేర్చారా' అని మరో నెటిజన్ కామెంట్ చేసాడు.

'వికీపీడియా ఒక జోక్ డేల్. కానీ.. మీ రివర్స్ స్వింగ్ కాదు', 'మీ టీమ్ సెలెక్టర్‌ను సంప్రదించండి, వారు ఏదైనా మార్చగలరు' అంటూ సరదాగా ట్వీట్లు చేస్తున్నారు. దక్షిణాఫ్రికా పేస‌రైన స్టెయిన్ మూడు ఫార్మాట్ల‌లో క‌లిపి మొత్తం 696 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. 93 టెస్టుల్లో 439, 125 వన్డేల్లో 196, 44 టీ20ల్లో 61 వికెట్లు తీసాడు. భుజం గాయం కారణంగా 2019 ప్రపంచకప్ నుండి స్టెయిన్ తప్పుకున్నాడు. గాయాలతో బాధపడుతున్న స్టెయిన్ 2016 నవంబర్ నుండి కేవలం 8 టెస్టులు, 9 వన్డేలు మరియు 2 టీ20లు మాత్రమే ఆడాడు.

త్వరలో ఇంగ్లాండ్‌తో జరగబోయే సిరీస్ కోసం దక్షిణాఫ్రికా పరిమిత ఓవర్లలో అంతర్జాతీయ క్రికెట్‌కు తిరిగి రాబోతున్నాడు. గతేడాది ముగిసిన ఐపీఎల్-13 వేలంలో డేల్ స్టెయిన్‌ను చివరి నిమిషంలో కనీసధర రూ. 2 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 92 మ్యాచ్‌లు ఆడిన డేల్ స్టెయిన్ 100 వికెట్ల మైలురాయిని అందుకునేందుకు కేవలం 4 వికెట్ల దూరంలో ఉన్నాడు.

గత సీజన్‌లో ఆర్సీబీ తరుపున డెల్ స్టెయిన్ కేవలం రెండు మ్యాచ్‌లకే పరిమతమయ్యాడు. గాయం కారణంగా మిగతా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో వేలానికి ముందు డేల్ స్టెయిన్‌ను ఆర్సీబీ వదులుకుంది. అయితే, వేలంలో తిరిగి కనీసధరకే కొనుగోలు చేసింది. వేలంలో స్టెయిన్‌ను కెప్టెన్ విరాట్ కోహ్లీతో చర్చించాకే కొనుగోలు చేశామని ఆర్సీబీ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్‌ మైక్ హెసన్‌ తెలిపాడు.

Story first published: Thursday, February 6, 2020, 12:51 [IST]
Other articles published on Feb 6, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+