For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాక్ అభిమానికి దిమ్మతిరిగే కౌంటరిచ్చిన సఫారీ పేసర్ స్టెయిన్

Dale Steyn Annihilates Pakistan Fan With Epic Reply To Taunt On Twitter

హైదరాబాద్: తనను కామెంట్ చేసిన ఓ పాకిస్థాన్‌ అభిమానికి దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చాడు దక్షిణాఫ్రికా బౌలింగ్‌ దిగ్గజం డేల్‌ స్టెయిన్‌‌ను. పాక్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌కు స్టెయిన్‌కు విశ్రాంతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో స్టెయిన్‌ తన ట్విట్టర్‌లో 'ఇప్పటివరకూ జరిగింది చాలు. ఈ టెస్ట్‌ని హాయిగా నా సోఫాలో కూర్చొని ఆస్వాదిస్తా. నేనిప్పుడు కుర్చి విమర్శకుడిని అయ్యాను'' అంటూ ట్వీట్‌ చేశాడు.

దీనికి ఓ పాక్ అభిమాని అత్యుత్సాహంతో ''అవును, ఈ టెస్ట్‌ సిరీస్‌లో బాబార్ అజమ్ నీ బౌలింగ్‌లో చితక్కొట్టినప్పుడు.. నీకు కచ్చితంగా విరామం కావాల్సిందిలే'' అంటూ ఎటకారంగా సమాధానమిచ్చాడు. దీనికి స్టెయిన్ సైతం తనదైన శైలిలో ఆ అభిమానికి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు.

''అవును టెస్ట్ సిరీస్ 3-0 తేడాతో గెలవడమే నిజంగా చితక్కొట్టించుకోవడమే'' అంటూ చురకలంటించాడు. ఈ సమాధానంతో సదరు అభిమాని ''నేను నా దేశం పరువు తీసినందుకు క్షమించండి. కానీ నాకు ఆ దిగ్గజం నుంచి రిప్లే కోసం అలా ట్వీట్ చేసాను'' అని పేర్కొన్నాడు.

డేల్ స్టెయిన్ సమాధానం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. బాబర్‌ ఆజమ్‌ క్రికెట్‌లోకి వచ్చిన బచ్చాగాడని, స్టెయిన్‌ దిగ్గజ బౌలరని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.. మరొక నెటిజన్ కామెంట్‌ చేసేముందు ఒళ్లు దగ్గర పెట్టుకోని చేయాలని హెచ్చరించాడు.

Story first published: Sunday, February 3, 2019, 10:24 [IST]
Other articles published on Feb 3, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+