కలలా ఉంది: ఐపీఎల్‌లో ఆడటంపై రోజువారి కూలీ కొడుకు
హైదరాబాద్: ఐపీఎల్‌లో ఆడే అవకాశం వస్తుందని అసలు ఊహించలేదని తమిళనాడుకు చెందిన దేశవాళీ క్రికెటర్ సంజయ్ సింగ్ యాదవ్ అన్నాడు. ఉత్తర ప్రదేశ్‌లోని గోరఖ్ పూర్ నుంచి తన తండ్రి రామ్ సింగ్ యాదవ్, కుటుంబసభ్యులు బతుకుదెరువు కోసం తమిళనాడులోని హోసూరుకు వలసవచ్చారని తెలిపాడు.
పీటీఐకి ఇచ్చిన ఇంటర్యూలో రోజువారి కూలీ కొడుకును అయిన తాను ఈ స్థాయికి చేరుకోవడంపై అతడు హర్షం వ్కక్తం చేశాడు. తాను టీఎన్సీఏ లీగ్‌లో సెకండ్ డివిజన్ జట్టు నుంచి ప్రాతినిధ్యం వహించేవాడనని చెప్పాడు. బ్యాటింగ్‌లోనే కాదు బౌలింగ్‌లోనూ తనది ఎడమచేతి వాటం అని సంజయ్ తెలిపాడు.

10 లక్షలకు కొనుగోలు చేసిన కోల్‌కతా
ఈ ఏడాది జరిగిన వేలంలో సంజయ్‌ను కోల్‌కతా ప్రాంఛైజీ రూ. 10 లక్షలకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ 10వ సీజన్‌లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టులో గౌతమ్ గంభీర్, యూసఫ్ పఠాన్ లాంటి టీమిండియా ఆటగాళ్లతో కలిసి ఆడబోతున్నందుక ఎంతో సంతోషంగా ఉందన్నాడు.

టీఎస్సీఎల్‌లో వీబీ తిరువళ్లూర్ తరఫున ఆడేవాడిని
‘టీఎస్సీఎల్‌లో వీబీ తిరువళ్లూర్ తరఫున ఆడేవాడిని. అందులో తన ప్రదర్శనతో తమిళనాడు టీ20లకు ఎంపికయ్యాను. ప్రస్తుతం కేకేఆర్ ఫ్రాంచైజీ రూ.10 లక్షల కాంట్రాక్టుతో నన్ను జట్టులోకి తీసుకుంది. కేకేఆర్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ బౌలింగ్ కిటుకులు నేర్చుకుంటున్నాను' అని సంజయ్ అన్నాడు.

అభిమాన క్రికెటర్లు వీరే
'ఎంతో మంది అంతర్జాతీయ ఆటగాళ్ల నైపుణ్యాన్ని చాలా దగ్గర నుంచి గమనించే అవకాశం దక్కిందని ముఖ్యంగా విరాట్ కోహ్లీ, అశ్విన్‌లతో పాటు విదేశీ స్పిన్నర్లు షకీబ్ అల్ హసన్, సునీల్ నరైన్‌లు తన అభిమాన క్రికెటర్లు' అని సంజయ్ యాదవ్ చెప్పుకొచ్చాడు.

అండగా నిలిచిన ప్రేమ్ నాథ్
సంజయ్ కోచింగ్‌కు డబ్బులేక ఇబ్బందులు పడుతుంటే ఫ్యూచర్ ఇండియా క్రికెట్ అకాడమీ కోచ్ ప్రేమ్ నాథ్ అండగా నిలిచాడు. సంజయ్ ఆటతీరును, నైపుణ్యాన్ని గుర్తించిన ప్రేమ్ నాథ్ సంజయ్ నుంచి ఎలాంటి ఫీజు ఆశించకుండానే కోచింగ్ ఇచ్చాడు. స్పోర్ట్స్ కోటాలో లయోలా కాలేజ్ లో డిగ్రీ చదువుతున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications