న్యూఢిల్లీ: టీమిండియా వన్డే, టీ20 కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కుటుంబంతో బాగా కాలక్షేపం చేస్తున్నట్లుగా కనిపిస్తున్నాడు. ఇటీవలే పెట్టుడు గడ్డంతో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేసి అభిమానులను ఒకింత ఆశ్చర్యానికి గురి చేసిన ధోని తాజాగా తన ముద్దుల కూతురు జివాతో ఉన్న ఓ ఫన్నీ వీడియోని ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు.
గత వారంలో పౌరాణిక సినిమాల్లో రుషులు తగిలించుకునే గడ్డంతో దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడం ఆ ఫోటో వైరల్‌గా మారిపోయింది. పొడవాటి గడ్డాన్ని తగిలించుకుని తన కుమార్తె జివాతో ధోని ఫోటోకు ఫోజిచ్చాడు. ఆ ఫోటోలో ఉన్నది వ్యక్తి ధోనియేనని అభియానులకు ఆలస్యంగా తెలియడంతో ఆశ్చర్యానికి గురయ్యారు.
క్రికెట్ నుంచి కాస్తంత విరామం లభించడంతో ధోని కుటుంబ సభ్యులతో సేద తీరుతున్నాడు. గత నెలలో జింబాబ్వే వన్డే సిరిస్ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ధోని ఎక్కువ విరామం లభిస్తుండటంతో కుటుంబ సభ్యులతో గడపనున్నట్లు చెప్పుకొచ్చాడు.
అంతేకాదు తన కుమార్తె తనను ఎంతో చక్కగా గుర్తుపడుతోందని చెప్పిన ధోని, ప్రస్తుతం ముద్దుల కూతురు జివాతో కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలను అభిమానులతో షేర్ చేసుకుంటున్నాడు.