
బీసీసీఐ రాజ్యాంగాన్ని సవరించాలంటే
అయితే, బీసీసీఐ రాజ్యాంగాన్ని సవరించాలంటే బోర్డు సభ్యుల్లో నాలుగింట మూడో వంతు మద్దతు అవసరం. అలాగే బోర్డు సభ్యులు మద్దతు తర్వాత సుప్రీంకోర్టు ఆమోదం కూడా తప్పనిసరి. మొత్తం 12 పాయింట్లతో కూడిన ఏజెండాలో పలు కీలక విషయాలను చర్చించనున్నారు. ఇందులో ముఖ్యమైనది కూలింగ్ ఆఫ్ పిరియడ్.

వరుసగా రెండు పర్యాయాలు
బీసీసీఐలో అధ్యక్షుడిగా లేదా కార్యదర్శిగా వరుసగా రెండు పర్యాయాలు పనిచేసిన వారికి కూలింగ్ ఆఫ్ పిరియడ్ అమలు చేయబడుతుంది. ఇందులో భాగంగా రెండోసారి ఆ పదవిలో కొనసాగాలంటే మూడేళ్ల విరామం ఉండాల్సిందే. ఇప్పుడు దీనిని గనుక సవరిస్తే మరో ఆరేళ్ల పాటు సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగొచ్చు.

తొమ్మిది నెలలపాటే ఈ పదవిలో
ప్రస్తుత నిబంధనల ప్రకారం గంగూలీ తొమ్మిది నెలలపాటే ఈ పదవిలో కొనసాగుతాడు. వీటితో పాటు ఈ 12 పాయింట్ల ఎజెండాలో అంబుడ్స్‌మన్‌తో పాటు ఎథిక్స్ ఆఫీసర్, కొత్త క్రికెట్ కమిటీలు, క్రికెట్ అడ్వైజరీ కమిటీతో పాటు పలు బోర్డు నియమ నిబంధనలకు సవరణలను ప్రతిపాదించాయి. ఈ నేపథ్యంలో పలు నిబంధనలను తొలగించే ఆలోచనలో బోర్డు ఉంది.

విరుద్ధ ప్రయోజనాల అంశంపై కూడా
ప్రస్తుతం భారత క్రికెట్‌లో అతిపెద్ద సమస్యగా మారిన అంశం ఇది. దీనివల్ల అత్యుత్తమ క్రికెటర్ల సేవలను బీసీసీఐ ఉపయోగించుకోవడం కష్టంగా మారింది. గతంలో విరుద్ధ ప్రయోజనాల అంశం పేరిట క్రికెట్ సలహా కమిటీలో సభ్యులుగా ఉన్న సచిన్, గంగూలీ, లక్ష్మణ్‌కు అంబుడ్స్‌మన్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. వీరితో పాటు రాహుల్ ద్రవిడ్, కపిల్ దేవ్‌కు ఈ అంశం సెగ తగిలింది. దీంతో ఈ అంశంపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.


Click it and Unblock the Notifications












