టీ20 ప్రపంచ టోర్నీ ప్రచారకర్తలుగా డబ్బావాలా
ముంబై: ఐసిసి ప్రపంచ టీ20 టోర్నీమెంట్ కోసం ముంబైలో పరిచయమక్కర్లేని డబ్బావాలాలు పని చేయనున్నారు. ముంబై నగరంలోని అనేక కార్యాలయాల ఉద్యోగులకు భోజనం అందించటంలో వీరిది కీలకపాత్ర అని వేరే చెప్పనక్కర్లేదు.
కాగా, భారత్‌లో మార్చి 8 నుంచి ఐసీసీ టీ20వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ టోర్నీకి వినూత్నంగా ప్రచారం చేయాలని ఐసీసీ నిర్ణయించింది. అందుకోసం డబ్బావాలాలను ప్రచారకర్తలుగా నియమించుకుంది.

మంగళవారం నుంచి ఆరంభమయ్యే ఈ మెగా టోర్నీ సుమారు నెలరోజులు పాటు జరగనుంది. ఈ సందర్భంగా ముంబైలోని డబ్బావాలాతో టీ20 ప్రపంచకప్‌నకు ప్రచారం చేయిచేందుకు శ్రీకారం చుట్టారు. సుమారు 50వేల డబ్బావాలాలు ఈ ప్రచార కార్యాక్రమంలో పాల్గొంటారు.
సోమవారం నుంచి వీరంతా టీ20 ప్రపంచకప్ లోగో కలిగిన టీషర్ట్‌లు ధరించి తమ విధుల్లో పాల్గొంటారు. టోర్నీ సూపర్-10 దశకు చేరుకున్న తర్వాత 25మంది డబ్బావాలాలను ఎంపిక చేసి వారికి ప్రత్యేకమైన దుస్తులు అందజేస్తారు. అంతేగాక, ముంబైలో జరిగే మ్యాచ్‌లకు స్టేడియంలోకి వీరిని అనుమతి ఇస్తారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications