
క్రికెట్‌లో మెడల్ ఖాయం..
క్రికెట్ మ్యాచ్‌లల్లో భాగంగా ఇవ్వాళ హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని మహిళా జట్టు.. ఫైనల్స్‌లో ఆడబోతోంది. బలమైన ప్రత్యర్థి ఆస్ట్రేలియాను ఢీ కొట్టబోతోంది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. కామన్‌వెల్త్ గేమ్స్‌లో భాగంగా ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లను ఆడిన భారత మహిళా జట్టు మూడింట్లో నెగ్గింది. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. ఆ తరువాత ఆడిన రెండింట్లోనూ ఘన విజయాన్ని అందుకుంది.

సెమీస్‌లో ఇంగ్లాండ్ చిత్తు..
తొలి సెమీఫైనల్‌లో లోకల్ టీమ్ ఇంగ్లాండ్‌ను చిత్తు చేసింది హర్మన్ ప్రీత్ కౌర్ అండ్ టీమ్. ఫైనల్స్‌లో అడుగు పెట్టింది. ఇంగ్లాండ్‌పై గెలవడంతో వెండి పతకం ఖాయమైంది. ఇక ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాను కూడా గెలిచేస్తే- టీమిండియా మహిళల క్రికెట్ మెడలో బంగారు పతకం వాలుతుంది. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమికి ప్రతీకారాన్ని తీర్చుకున్నట్టవుతుంది. ఈ మ్యాచ్ కోసం విమెన్స్ టీమిండియా కసరత్తు చేస్తోంది.


ఆల్‌రౌండ్ పెర్‌ఫార్మెన్స్..
తొలి సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై తిరుగులేని విజయాన్ని అందుకుంది. ఆల్‌రౌండ్ పెర్‌ఫార్మెన్స్‌తో అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన హర్మన్ ప్రీత్ టీమ్.. నిర్ణీత 20 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన 61, జెమిమా రోడ్రిగ్స్-44, కేప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 20, దీప్తి శర్మ-20 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ జట్టు 20 ఓవర్లల్లో ఆరు వికెట్ల నష్టానికి 160 పరుగులే చేసింది.

పిచ్ రిపోర్ట్..
భారత కాలమానం ప్రకారం.. ఈ మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. సోని లివ్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఎడ్జ్‌బాస్టన్ పిచ్ గురించి భారత క్రికెట్ ప్రేమికులకు ప్రత్యేకించి పరిచయం చేయనక్కర్లేదు. భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య పలు మ్యాచ్‌లకు ఈ స్టేడియం ఆతిథ్యాన్ని ఇచ్చింది. ఇటీవలే ఈ రెండు జట్లు తలపడ్డాయి కూడా. బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్ ఇది. స్పిన్నర్లకు స్వర్గధామం. 150 పరుగులకు పైగా స్కోర్ చేసిన జట్టు మ్యాచ్‌ను గెలవడం ఖాయం అనేదిక్కడ సంప్రదాయం.

తుదిజట్టు అంచనాలివే..
భారత తుదిజట్టులో- హర్మన్‌ప్రీత్ కౌర్ (కేప్టెన్), స్మృతి మంధాన (వైస్ కేప్టెన్), షెఫాలి వర్మ, మేఘన సింగ్, తానియా సప్న భాటియా (వికెట్ కీపర్), జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, పూజ వస్త్రకర్, రాధా యాదవ్, స్నేహ్ రాణా, రేణుకా సింగ్ ఆడే అవకాశాలు ఉన్నాయి. ఆస్ట్రేలియా తుదిజట్టులో- అలైస్సా హీలీ (వికెట్ కీపర్), బెత్ మూనీ, మెగ్ ల్యాన్నింగ్ (కేప్టెన్), తహ్లియా మెక్‌గ్రాత్, రేఛల్ హేన్స్, యాష్లే గార్డెనర్, గ్రేస్ హ్యారిస్, జెస్ జొనాస్సెన్, అలనా కింగ్, మెగాన్ షుట్, డార్సీ బ్రౌన్ ఆడొచ్చు.


Click it and Unblock the Notifications












