
బిగ్ క్లాష్..
క్రికెట్ మ్యాచ్‌లల్లో భాగంగా ఇవ్వాళ హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని మహిళా జట్టు.. ఇంగ్లాండ్‌తో తలపడబోతోంది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. కామన్‌వెల్త్ గేమ్స్‌లో భాగంగా ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లను ఆడిన భారత మహిళా జట్టు రెండింట్లో నెగ్గింది. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైన అనంతరం ఆడిన రెండింట్లోనూ ఘన విజయాన్ని అందుకుంది. సెమీ ఫైనల్స్‌లో అడుగు పెట్టింది.

ఎడ్జ్‌బాస్టన్‌లో..
బార్బడొస్‌పై ఏకంగా 100 పరుగుల తేడాతో తిరుగులేని విజయాన్ని అందుకుని మరీ సెమీ ఫైనల్స్‌లో ఎంట్రీ ఇచ్చింది. తొలి సెమీఫైనల్‌లో లోకల్ టీమ్ ఇంగ్లాండ్‌ను ఎదుర్కొనబోతోంది. భారత్‌తో పోల్చుకుంటే ఇంగ్లాండ్ విజయాల శాతం ఎక్కువ. ఏ ఒక్క మ్యాచ్‌లోనూ ఓటమిపాలు కాలేదు. సమవుజ్జీలుగా నిలిచిన ఈ రెండు జట్ల మధ్య పోరు ఉత్కంఠభరితంగా మారింది. పైగా ఫైనల్స్ చేరాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్ కావడం వల్ల ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో సీట్ ఎడ్జ్ మ్యాచ్‌ను చూసే అవకాశాలు లేకపోలేదు.

పిచ్ రిపోర్ట్..
భారత కాలమానం ప్రకారం.. ఈ మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. సోని లివ్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఎడ్జ్‌బాస్టన్ పిచ్ గురించి భారత క్రికెట్ ప్రేమికులకు ప్రత్యేకించి పరిచయం చేయనక్కర్లేదు. భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య పలు మ్యాచ్‌లకు ఈ స్టేడియం ఆతిథ్యాన్ని ఇచ్చింది. ఇటీవలే ఈ రెండు జట్లు తలపడ్డాయి కూడా. బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్ ఇది. స్పిన్నర్లకు స్వర్గధామం. 150 పరుగులకు పైగా స్కోర్ చేసిన జట్టు మ్యాచ్‌ను గెలవడం ఖాయం అనేదిక్కడ సంప్రదాయం.

తుదిజట్టు అంచనాలివే..
భారత తుదిజట్టులో- షెఫాలి వర్మ, స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కేప్టెన్), తానియా భాటియా (వికెట్ కీపర్), దీప్తి శర్మ, పూజ వస్త్రకర్, రాధా యాదవ్, స్నేహ్ రాణా, మేఘన సింగ్, రేణుకా సింగ్ ఆడే అవకాశాలు ఉన్నాయి. ఇంగ్లాండ్ జట్టులో- డేనియల్లె వ్యాట్, సోఫియా డంక్లే, అలైస్ క్యాప్సె, నటాలియా స్కీవర్ (కేప్టెన్), అమీ జోన్స్ (వికెట్ కీపర్), మియా బౌచియర్, క్యాథరిన్ బ్రంట్, సోఫీ ఎక్లేస్టొన్, ఫ్రియా కెంప్, ఇస్సీ వాంగ్, సారా గ్లెన్ ఆడొచ్చు.


Click it and Unblock the Notifications
