Smriti Mandhana: ఆ గూస్‌బంప్స్ అనుభూతి చెందాలని ఆరాటం..! అదో వింత ఫీలింగ్

టోక్యో ఒలంపిక్స్ పోడియంపై నిలబడి.. స్టేడియంలో జాతీయ గీతం ఆలపిస్తుండగా నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ అందుకున్న ఉద్విగ్న క్షణాలను చూసి తనకు గూస్ బంప్స్ వచ్చాయని స్మృతి మంధాన తెలిపింది. 2022లో బర్మింగ్‌హామ్‌లో జరిగే కామన్వెల్త్ గేమ్స్‌లో అలాంటి అనుభూతిని పొందేందుకు తాము గెలవాలనుకుంటున్నామని భారత మహిళల జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన తెలిపింది. ఒలంపిక్స్‌లో నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ అందుకున్నప్పుడు నాకు నిజంగా గూస్‌బంప్స్ వచ్చాయి.
మేము ఇప్పుడు అలాంటి విజయం సాధించే అవకాశం ఉంది. పోడియంపై నిల్చుండగా.. మన జెండా పైకి వెళ్లి జాతీయ గీతం ప్లే చేస్తుంటే వచ్చే అనుభూతి అనిర్వచనీయం. క్రికెట్ జట్టుగా మేము ఎప్పుడూ ట్రోఫీ కోసం పోరాడాము. తొలిసారి గోల్డ్ మెడల్ కోసం పోటీపడడం వింత అనుభూతి.' అని మంధాన తెలిపింది.
మిగతా అథ్లెట్లతో కలిసి పాల్గొనడం వింత అనుభూతి
ఇక బర్మింగ్‌హామ్‌లో జరగబోయే కామన్ వెల్త్ గేమ్స్ కోసం మహిళా క్రికెటర్లు సెపరేటుగా కాకుండా ఇండియా కంటింజెంట్ (అథ్లెట్లు)తో కలిసి వెళ్లబోతున్నారు. 'ఇది జట్టుకు చాలా కొత్త విషయం. మేము ఇతర క్రీడలు కూడా పాల్గొనే టోర్నమెంట్ ఆడటం ఎప్పుడూ అనుభవించలేదు. నేను వివిధ అథ్లెట్‌లతో సంభాషణలు జరపాలనుకుంటున్నా.
వారు ఎలాంటి శిక్షణ పొందుతున్నారో.. ఇంకా చాలా విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నా. ఇతర క్రీడల్లో రాణిస్తున్నవారిని వ్యక్తిగతంగా కలవడం అద్భుతంగా ఉంటుంది. వారి ఆటను తెలుసుకోవడానికి, అనుభవాలను పంచుకోవడానికి ప్రయత్నిస్తే.. మా వ్యక్తిగత విషయాల్లోనూ ఎంతో ప్రభావం చూపుతుందని నేను భావిస్తున్నాను.' అని మంధాన చెప్పింది.

లంక పర్యటన విజయవంతం కావడం ప్లస్ పాయింట్
ఇటీవల భారత మహిళల జట్టు శ్రీలంకలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ పర్యటన విజయవంతమైంది. అక్కడ భారత్ టీ20 సిరీస్‌ను 2-1తేడాతో, వన్డే సిరీస్‌ను 3-0 తేడాతో ఇండియా గెలుచుకుంది. 'శ్రీలంక పర్యటన మా జట్టుకు వన్డేలు, టీ20లకు నిజంగా మంచి సన్నాహకం అని చెప్పొచ్చు. మేము మంచి ఫిట్‌నెస్ క్యాంప్ కూడా చేశాం. మేము వ్యక్తిగతంగా కూడా బాగా మెరుగయ్యాం' అని మంధాన తెలిపింది.

ఆస్ట్రేలియా అయితే ఏంటీ
ఇకపోతే కామన్ వెల్త్ గేమ్స్ వుమెన్స్ క్రికెట్ పోటీలు జూలై 29న శుక్రవారం బర్మింగ్‌హామ్‌లో ప్రారంభమవుతాయి. ప్రారంభ మ్యాచ్‌లో భారత జట్టు ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఇక ఆస్ట్రేలియా లాంటి బిగ్ టీంను మేం పెద్ద టీం అని చూడట్లేదని, టీ20 ఫార్మాట్లో ఏ టీం అయినా సమానమేనని, తమదైన రోజులన ఏ జట్టు అయినా గెలవొచ్చని మంధాన పేర్కొంది. తాము పాకిస్థాన్, ఆస్ట్రేలియా, బార్బడస్‌తో తలపడబోయే మూడు మ్యాచ్‌లను సీరియస్‌గానే తీసుకుంటాం అని మంధాన తెలిపింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications