CWG 2022: కామన్‌వెల్త్ గేమ్స్ క్రికెట్ మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్ ఇదే.. తొలి రోజే భారత్ మ్యాచ్..!

మహిళల క్రికెట్ పోటీలు మొదటిసారిగా బర్మింగ్‌హామ్‌లో జరిగే కామన్‌వెల్త్ గేమ్స్ 2022లో జరగనున్నాయి. జులై 29న ఈ పోటీలు ప్రారంభమవుతాయి. ఇకపోతే కామన్‌వెల్త్ గేమ్స్ క్రికెట్ మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్, మ్యాచ్ జాబితాలు, స్టార్టింగ్ టైంలు ఇలా ఉన్నాయి. 1998లో తొలిసారి మరియు చివరిసారిగా క్రికెట్ పోటీలు జరిగాయి. అప్పట్లో 16మెన్స్ జట్లు 11రోజుల పాటు 50ఓవర్ల ఫార్మాట్‌లో క్రికెట్లో తలపడ్డాయి. అప్పుడు దక్షిణాఫ్రికా బంగారు పతకం సాధించింది.

ఎడ్జ్‌బాస్టన్‌లో మొత్తం 16 మ్యాచ్‌లు
ఈ సంవత్సరం కామన్ వెల్త్ గేమ్స్‌లో మహిళల క్రికెట్ జరగబోతుంది. అన్ని మ్యాచ్‌లు టీ20ఫార్మాట్‌లో నడుస్తాయి. అన్ని మ్యాచ్‌లు ఎడ్జ్‌బాస్టన్‌లోనే జరుగుతాయి. ఈ ఈవెంట్‌లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. 16 మ్యాచ్‌లు జరుగుతాయి. గ్రూప్ Aలో పాకిస్థాన్, ఆస్ట్రేలియా, ఇండియా, బార్బడోస్ ఉన్నాయి. శ్రీలంక, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా గ్రూప్ Bలో ఉన్నాయి. అన్ని జట్లూ తమ గ్రూప్‌లోని జట్లతో ఒకసారి తలపడతాయి. ప్రతి గ్రూప్ నుంచి మొదటి రెండు దేశాలు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. సెమీస్‌లో ఓడిన రెండు జట్లు కాంస్య పతక పోరులో తలపడతాయి. జులై 29న ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ మధ్య మ్యాచ్‌తో మహిళల క్రికెట్ పోటీలు ప్రారంభమవుతాయి.

CWG 2022: మహిళల క్రికెట్ మ్యాచ్‌ల షెడ్యూల్, మ్యాచ్‌లు, టైమింగ్స్
గ్రూప్ A
1. జులై 29న ఆస్ట్రేలియా vs భారత్, మధ్యాహ్నం 12గంటలకు
2. జూలై 29న పాకిస్థాన్ vs బార్బడోస్, రాత్రి 7గంటలకు
3. జులై 31న భారత్ vs పాకిస్థాన్, మధ్యాహ్నం 12గంటలకు
4. జులై 31న బార్బడోస్ vs ఆస్ట్రేలియా, రాత్రి 7గంటలకు
5. ఆగస్టు 3న ఆస్ట్రేలియా vs పాకిస్థాన్, మధ్యాహ్నం 12గంటలకు
6. ఆగస్టు 3న ఇండియా vs బార్బడోస్, రాత్రి 7గంటలకు

గ్రూప్ B
1. జులైన 30న న్యూజిలాండ్ vs సౌతాఫ్రికా, సాయంత్రం 4గంటలకు
2. జులై 30న ఇంగ్లండ్ vs శ్రీలంక, రాత్రి 7గంటలకు
3. ఆగస్టు 2న, ఇంగ్లండ్ vs సౌతాఫ్రికా, సాయంత్రం 4గంటలకు
4. ఆగస్టు 2న, శ్రీలంక vs న్యూజిలాండ్, రాత్రి 7గంటలకు
5. ఆగస్టు 4న, దక్షిణాఫ్రికా vs శ్రీలంక, సాయంత్రం 4గంటలకు
6. ఆగస్టు 4న ఇంగ్లాండ్ vs న్యూజిలాండ్, రాత్రి 7గంటలకు

సెమీఫైనల్స్ మరియు ఫైనల్స్
1వ సెమీఫైనల్ : ఆగస్టు 6న మధ్యాహ్నం 12గంటలకు
2వ సెమీఫైనల్ : ఆగస్టు 6న, రాత్రి 7గంటలకు
కాంస్య పతక మ్యాచ్ : ఆగస్టు 7న ఉదయం 11గంటలకు
ఫైనల్ మ్యాచ్ : ఆగస్టు 7న విన్నర్ గోల్డ్ మెడల్, రన్నర్ సిల్వర్ మెడల్, సాయంత్రం 6గంటలకు
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications