'చాంపియన్స్ ట్రోఫీతో చాలా నేర్చుకున్నాం.. తప్పిదాలు చేయకుండా ఆడతాం'

ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2017లో చాలా నేర్చుకున్నాం. ప్రపంచకప్‌లో ఎలాంటి తప్పిదాలు చేయకుండా ఆడతాం అని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం దక్షిణాఫ్రికాతో టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విరాట్ కోహ్లీ పాల్గొన్నాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
చాంపియన్స్ ట్రోఫీ గుణపాఠాలు నేర్పింది:
విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... '2017 చాంపియన్స్ ట్రోఫీ చాలా గుణపాఠాలు నేర్పింది. ఎలా ఆడాలో తెలుసుకున్నాం. ఫైనల్లో ఉత్తమ ప్రదర్శన ఇచ్చిన జట్టే విజయం సాధిస్తుంది. జట్టులోని లోపాలపై దృష్టి పెట్టాం. చాంపియన్స్ ట్రోఫీ అనంతరం జట్టులో కొన్ని మార్పులు జరిగాయి. మధ్య ఓవర్లలో వికెట్లు తీసేందుకు స్పిన్ ద్వయం చాహల్, కుల్దీప్ జట్టులోకి వచ్చారు. అప్పటి జట్టుతో పోలిస్తే ఇప్పుడు మేం మరింత బలంగా ఉన్నాం' అని కోహ్లీ తెలిపాడు.
అంచనాలు ఉండడం సహజమే:
'గాయం నుంచి కోలుకున్న కేదార్ జాదవ్ తొలి మ్యాచ్‌కి అందుబాటులో ఉంటాడు. ప్రపంచకప్‌లో భారత్‌పై ఉన్న అంచనాల గురించి తెలుసు. వాటిని అందుకుంటాం' అని కోహ్లీ చెప్పాడు. 2011, 2015 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌ల్లో కోహ్లీ సెంచరీలు సాధించాడు. మరి మూడోసారి కూడా సెంచరీ చేస్తారా అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. 'అంచనాలు ఉండడం సహజమే. వీటిని ఎలా ఎదుర్కోవాలో తెలుసు. క్రీజులోకి వచ్చిన ప్రతిసారీ నా నుంచి సెంచరీ ఆశిస్తారనేది వాస్తవమే. కానీ ఇదంతా ఆటలో భాగంగానే చూస్తా' అని కోహ్లీ అన్నారు.
నేరుగా అతడితోనే చర్చిస్తా:
సఫారీ పేసర్ రబాడ తనపై విమర్శలు చేసిన విషయమై స్పందిస్తూ... 'ఇప్పుడు రబాడకు వ్యతిరేకంగా మాట్లాడను. నాకు, అతడికి మధ్య ఏదన్నా ఉంటే నేరుగా అతడితోనే చర్చిస్తా. అతడో అద్భుత బౌలర్. అతడిని గౌరవిస్తా. ఏజట్టుకైనా ప్రమాదకారే. మేము అతన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాల్సి ఉంది' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications