For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

100వ వన్డే.. ఇది ఓ అద్భుత ప్రయాణం

CWC2019: Africa vs Bangladesh Match: Imran Tahir reflects on amazing journey as he prepares for 100th ODI

దక్షిణాఫ్రికా సీనియర్ లెగ్‌ స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహిర్‌ 100వ వన్డే ఆడాడు. ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం బంగ్లాదేశ్‌తో దక్షిణాఫ్రికా ఆడిన మ్యాచ్ ఇమ్రాన్‌ తాహిర్‌కు 100వ వన్డే. నికీ బోయె తర్వాత ఈ మార్క్‌ చేరిన రెండో దక్షిణాఫ్రికా స్పిన్నర్‌ తాహిరే కావడం విశేషం. అయితే తాహిర్‌కు 100వ వన్డే చేదు అనుభవాన్ని మిగిల్చింది. బంగ్లాతో జరిగిన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 21 పరుగుల తేడాతో ఓడిపోయింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఓ అద్భుత ప్రయాణం:

ఓ అద్భుత ప్రయాణం:

100వ వన్డే సందర్భంగా తాహిర్ మాట్లాడుతూ... 'ఇది ఎంతో ప్రత్యేకమైనది. ఇది ఓ అద్భుత ప్రయాణం. 100 వన్డేలు దక్షిణాఫ్రికా తరపున ఆడుతానని నేను ఎప్పుడు అనుకోలేదు. గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన దక్షిణాఫ్రికా ప్రజలకు, జట్టు యాజమాన్యం, ఆటగాళ్లకు కృతజ్ఞతలు. నా వంతు కృషిని దేశం కోసం చేస్తున్నా' అని తాహిర్ తెలిపాడు.

చాలా కష్టాలను చూశాను:

చాలా కష్టాలను చూశాను:

'2011 ప్రపంచకప్‌లో నా తొలి వన్డే ఆడా. మళ్లీ ప్రపంచకప్‌లోనే 100 మ్యాచ్‌ ఆడాను. ఇది ఉద్వేగంగా ఉంది. నేను చాలా కష్టాలను చూశాను. నేను ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ ఆడకుండానే.. నా తల్లిదండ్రులను కోల్పోయాను. కాబట్టి ఈ విషయాలు నాకు నిజంగా ప్రత్యేకమైనవి. నా కుటుంబంకు కూడా. నేను నా కుటుంబానికి దూరంగా ఉన్నాను, అయితే దాని కోసం ఒక ముఖ్యమైన కారణం ఉంది' అని తాహిర్ పేర్కొన్నాడు.

క్రికెట్ ఆస్వాదిస్తున్నా:

క్రికెట్ ఆస్వాదిస్తున్నా:

'దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ఒత్తిడి ఉంటుంది. అయితే నేను దానిని సానుకూలంగా తీసుకుంటాను. ఇంగ్లాండ్ చేతిలో పరాజయం పొందాం. తప్పులను సరిదిద్దుకుంటాం. నేను సవాళ్లను ఇష్టపడే వ్యక్తిని. కెప్టెన్ ఎటువంటి సమయంలో బంతిని ఇచ్చినా.. మంచి ప్రదర్శన చేయడానికి ప్రయత్నిస్తా. చాలా హార్డ్ వర్క్ చేస్తాను. నాకు తెలుసు జట్టులో నేనే పెద్ద వయస్కున్ని. ఫిట్ గా ఉండి వారితో ఆడుతున్నందుకు సంతోషంగా ఉంది. నేను క్రికెట్ ఆస్వాదిస్తున్నా' అని తాహిర్ చెప్పుకొచ్చాడు.

తొలి చూపులోనే ప్రేమించాడు:

తొలి చూపులోనే ప్రేమించాడు:

1998లో సౌతాఫ్రికాలో జరిగిన అండర్‌-19 ప్రపంచకప్‌నకు తాహిర్‌ పాకిస్థాన్‌ జట్టు సభ్యుడిగా వెళ్ళాడు. తాహిర్‌ అక్కడ భారత సంతతికి చెందిన మోడల్‌ సుమయ్య దిల్దార్‌ను చూసి.. తొలి చూపులోనే ప్రేమించాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే సుమయ్య సౌతాఫ్రికా నుంచి రాననడంతో.. 2006లో తాహిర్‌ దక్షిణాఫ్రికా వచ్చేసాడు. అనంతరం సుమయ్యను పెళ్లి చేసుకుని.. 2011లో సౌతాఫ్రికా జట్టులో అరంగేట్రం చేశాడు.

Story first published: Monday, June 3, 2019, 13:15 [IST]
Other articles published on Jun 3, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+