Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'ప్రపంచాన్ని మార్చే శక్తి ప్రపంచకప్‌కే ఉంది'

CWC19: World Cup tournament has potential to change the world says Pompeo

అంతర్జాతీయంగా ప్రభావం చూపించే కార్యక్రమాల్లో ఐసీసీ క్రికెట్‌ ప్రపంచకప్‌ 2019 ఒకటి. ప్రపంచాన్ని మార్చే శక్తి ప్రపంచకప్‌కే ఉంది అని అమెరికా మంత్రి మైక్‌ పాంపియో అభిప్రాయపడ్డారు. బుధవారం అమెరికాలో యూఎస్‌ ఐబీసీలో భారత ఆలోచనల సదస్సులో పాంపియో పాల్గొన్నారు. పాంపియోతో పాటు గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌.. భారత్‌, అమెరికాకు చెందిన కార్పొరేట్‌ ప్రముఖులు పాల్గొన్నారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ప్రపంచాన్ని మార్చే ప్రపంచకప్‌:

ప్రపంచాన్ని మార్చే ప్రపంచకప్‌:

ఈ సందర్భంగా మైక్‌ పాంపియో మాట్లాడుతూ... 'ప్రపంచకప్‌ టోర్నీని వందల కోట్ల మంది అభిమానులు వీక్షిస్తున్నారు. అందరూ కీలకమైన సంభాషణలు చేస్తున్నారు. ప్రస్తుతం కీలకమైన అంతర్జాతీయ ఈవెంట్‌ జరుగుతోంది. ఈ ఈవెంట్‌ గురించి వందల కోట్ల మంది తెలుసుకుంటున్నారు. అదే క్రికెట్‌ ప్రపంచకప్‌. ప్రపంచాన్ని మార్చే శక్తి ప్రపంచకప్‌కే ఉంది' అని పాంపియో పేర్కొన్నారు. జూన్‌ 24 నుంచి 30 వరకు పాంపియో భారత్‌, శ్రీలంక, జపాన్‌, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో వ్యూహాత్మక ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో అమెరికా సంబంధాలను మరింత మెరుగు పరచడమే పాంపియో లక్ష్యం.

క్రికెట్‌లో అది మంచి షాట్:

క్రికెట్‌లో అది మంచి షాట్:

సుందర్ పిచాయ్ మాట్లాడుతూ... 'ప్రపంచకప్‌ ఫైనల్ మ్యాచ్ భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ జట్లు కూడా సమర్దవంతమైనవి. నేను తొలిసారి అమెరికాకు వచ్చినప్పుడు బేస్‌బాల్‌ ఆట పట్ల ఆకర్షితుడినయ్యాను. బేస్ బాల్ సవాల్‌తో కూడుకున్న ఆట. అయితే, నా గేమ్‌లో నేను బంతిని సమర్థవంతంగా వెనకవైపునకు కొట్టాను. క్రికెట్‌లో అది మంచి షాట్ అవుతుంది' అని పేర్కొన్నారు.

బేస్‌బాల్ ఆట చాలా భిన్నమైంది:

బేస్‌బాల్ ఆట చాలా భిన్నమైంది:

'క్రికెట్‌లో పరుగులు తీస్తున్న సమయంలో ఎల్లప్పుడూ బ్యాట్‌ను పట్టుకునే పరుగులు తీయాలి. బేస్‌ మధ్యలో నేను బ్యాట్ పట్టుకుని పరుగులు తీశాను. అయితే, నాకు అప్పుడు తెలిసింది.. బేస్‌బాల్ ఆట చాలా భిన్నమైందని. కొన్ని విషయాలపై సర్దుకుపోగలను. క్రికెట్‌ పట్ల నా అభిప్రాయం మాత్రం మారదు' అని పిచాయ్ అన్నారు. క్రికెట్‌కు సుందర్ పిచాయ్ పెద్ద అభిమాని అన్న సంగతి తెలిసిందే.

Story first published: Friday, June 14, 2019, 7:28 [IST]
Other articles published on Jun 14, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+