వెస్టిండీస్‌తో దక్షిణాఫ్రికా ఢీ.. ఓడితే సెమీస్ ఆశలు గల్లంతే

దక్షిణాఫ్రికా ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు గెలుపు రుచి చూడలేదు. ఆ జట్టు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. దీంతో సెమీస్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే సోమవారం వెస్టిండీస్‌తో జరిగే మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తప్పనిసరి గెలవాలి. ఒకవేళ ఓడితే మాత్రం ప్రోటీన్ సెమీస్ ఆశలు దాదాపు గల్లంతే. మరోవైపు వెస్టిండీస్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్ గెలిచి.. మరో మ్యాచ్‌లో ఓడింది. విండీస్ కూడా దక్షిణాఫ్రికాపై గెలవాలనే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

బలంగా పేస్:
టోర్నీలో మొదటి మ్యాచ్ నుండి విండీస్ పేసర్లు ఆకట్టుకుంటున్నారు. తొలి మ్యాచ్‌లో కెప్టెన్ జాసన్ హోల్డర్, రస్సెల్, థామస్ ల ధాటికి పాకిస్థాన్ 105 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక ఆస్ట్రేలియాతో జరిగిన రెండో మ్యాచ్‌లో బ్రాత్‌వైట్, కార్టెల్ ఫామ్ అందుకున్నారు. దీంతో విండీస్ బౌలింగ్ పటిష్టంగా ఉంది. హిట్టర్లతో బలంగా ఉన్న విండీస్.. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ విధించిన సాధారణ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. అయితే రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై షై హోప్, హోల్డర్ మాత్రమే రాణించారు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో క్రిస్ గేల్ మెరుపు అర్ధ శతకం చేసి టచ్ లో ఉన్నాడు. డారీన్ బ్రావో గాడిలో పడాల్సి ఉంది. నికోలస్ పూరన్, హెట్మయర్ ఫామ్‌లో ఉండడం కలిసొచ్చే అంశం. చివరలో హోల్డర్, రసెల్‌లు ఆదుకోనున్నారు.

బ్యాటింగ్ సమస్య:
టోర్నీ ఆరంభం వరకు పేస్‌తో బలంగా ఉన్న సఫారీలు.. ఆరంభం అయ్యేసరికి డీలా పడ్డారు. ఒక్క మ్యాచ్ ఆడకుండానే స్టార్ పేసర్ స్టెయిన్ టోర్నీకి దూరం కాగా.. మరో పేసర్ ఎంగ్డీ ఈ మ్యాచ్ ఆడే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. రబడ ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తున్నాడు. అయితే సఫారీ బౌలర్లు భారత్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లో కాస్త ఫర్వాలేదనిపించారు. ఇక బ్యాటింగ్ సమస్య సఫారీలను వేధిస్తోంది. మూడు మ్యాచ్‌లు ఆడినా ఒక్క ఆటగాడు శతకం చేయలేదు. డీకాక్, డస్సెన్, డుప్లెసిస్ తప్ప అందరూ విఫలమయ్యారు. డుమిని, మిల్లర్, ఆమ్లాలు ఈ మ్యాచ్‌లోనైనా గాడిలో పడకపోతే ప్రోటీస్‌కు మరో ఓటమి తప్పదు.

బ్యాటింగ్‌కు అనుకూలం:
ప్రస్తుతం సౌథాంప్టన్‌లో ఎక్కువ చలితో కూడిన వాతావరణం ఉంది. మబ్బు పట్టి ఉంది. వర్షం కురిసే అవకాశాలు కూడా ఉన్నాయి. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించనుంది. ఈ పిచ్‌పై పరుగుల వరద ఖాయం. అయితే మబ్బు పట్టి ఉండడంతో పిచ్ నెమ్మదించే అవకాశాలున్నాయి.

సఫారీలదే పైచేయి కానీ:
దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌లు ఇప్పటివరకు 61 వన్డేలు ఆడాయి. ఇందులో దక్షిణాఫ్రికా 44 విజయాలు అందుకోగా.. విండీస్ 15 మాత్రమే గెలిచింది. ఒక మ్యాచ్ టై అయ్యింది. మరో మ్యాచ్ రద్దయ్యింది. ప్రపంచకప్‌లో విండీస్, దక్షిణాఫ్రికా ఆరుసార్లు తలపడగా.. సఫారీ జట్టు నాలుగుసార్లు, విండీస్ రెండుసార్లు గెలిచాయి. గణాంకాల్లో వెస్టిండీస్‌పై సఫారీలకు తిరుగులేని ఆధిపత్యం ఉంది. కానీ ప్రస్తుత పరిస్థుతుల నేపథ్యంలో సఫారీలకు విజయం కష్టమే.
{headtohead_cricket_6_8}
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications