దక్షిణాఫ్రికాతో భారత్ మ్యాచ్.. కోహ్లీ రికార్డుని ఆమ్లా బద్దలు కొట్టేనా?

భారత దేశ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న రోజు రానే వచ్చింది. మరికొన్ని గంటల్లోనే భారత్ ప్రపంచకప్ తొలి మ్యాచ్ ఆడనుంది. టోర్నీలో భాగంగా బుధవారం మధ్యాహ్నం సౌతాంఫ్టన్ వేదికగా భారత్ -దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ప్రపంచకప్‌లో ప్రొటీస్ జట్టుకు మూడో మ్యాచ్ కాగా.. టీంఇండియాకు తొలి మ్యాచ్. ఆడిన రెండు మ్యాచులలో ఓడిన ప్రొటీస్.. తొలి విజయం కోసం బరిలోకి దిగుతోంది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

కోహ్లీ రికార్డు బద్దలు కొట్టేనా:
ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి చెందిన ఓ రికార్డుకి దక్షిణాఫ్రికా ఓపెనర్ హషీమ్ ఆమ్లా చేరువయ్యాడు. ఆమ్లా మరో 77 పరుగులు చేస్తే.. వన్డేల్లో అత్యంత వేగంగా 8వేల పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. విరాట్ కోహ్లీ వన్డేల్లో 8వేల పరుగుల మైలరాయిని 175 ఇన్నింగ్స్‌లో అందుకోగా.. ఆమ్లా 172 ఇన్నింగ్స్‌లో 7923 పరుగులు సాధించాడు. ఆమ్లా ఈ రికార్డును అందుకోవడానికి ఇంకా రెండు ఇన్నింగ్స్‌లు ఉన్నాయి. ఇంగ్లండ్‌తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో గాయపడిన ఆమ్లా.. బంగ్లాదేశ్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. కోలుకున్న ఆమ్లా ఏ మేరకు రాణిస్తాడో చూడాలి.

క్వింటన్ డికాక్ కూడా:
దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలయర్స్ 182 ఇన్నింగ్స్‌లలో 8వేల పరుగులను పూర్తి చేసాడు. ఆ తర్వాత సౌరవ్ గంగూల్, రోహిత్ శర్మ, రాస్ టేలర్‌లు ఈ జాబితాలో ఉన్నారు. దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ కూడా 8 వేల పరుగులు పూర్తి చేయడానికి 22 పరుగుల దూరంలో ఉన్నాడు. అయితే డికాక్ మాత్రం వేగవంతమైన జాబితాలో లేడు.

77 పరుగులు చేస్తే:
వన్డేల్లో రెండు వేలు, మూడు వేలు, నాలుగు వేలు, ఐదు వేలు, ఆరు వేలు, ఏడు వేల పరుగులను ఆమ్లానే అత్యంత వేగంగా అందుకున్న రికార్డుని సొంతం చేసుకున్నాడు. మరోవైపు ఈ మ్యాచ్‌లో 77 పరుగులు చేస్తే.. దక్షిణాఫ్రికా తరఫున 8000 పరుగులు అందుకున్న నాలుగో ఆటగాడిగా అరుదైన ఘనత సాధిస్తాడు. అంతకుముందు జాక్వస్ కలీస్ (11550), ఏబీ డివిలియర్స్ (9427), హార్ష్‌లే గిబ్స్ (8094)లు ఈ జాబితాలో ఆమ్లా కన్నా ముందు వరుసలో ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications