'ఆమ్లా అలా ఔట్ అవ్వడం వన్డేల్లో నేనింతవరకు చూడలేదు'

దక్షిణాఫ్రికా ఓపెనర్ హషీమ్ ఆమ్లా ఆ బంతికి ఔట్ అవ్వడం వన్డేల్లో నేనింతవరకు చూడలేదు అని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. ప్రపంచకప్‌లో టీమిండియా బోణీ కొట్టింది. బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. సఫారీ జట్టు నిర్దేశించిన 228 పరుగుల లక్ష్యాన్ని నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. 'హిట్ మ్యాన్' రోహిత్ శర్మ (122 నాటౌట్; 144బంతుల్లో 13ఫోర్లు, 2సిక్సర్లు) సెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

రోహిత్‌కు హ్యాట్సాఫ్:
మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ కోహ్లీ మాట్లాడుతూ... 'ప్రపంచకప్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాం. అయితే ఒత్తిడితో కూడిన మ్యాచ్ ఎదురైంది. ఇది జట్టు సమిష్టి విజయం. మ్యాచ్ ఎలా సాగిందో, పిచ్ ఎలా స్పందించిందో చూస్తే.. ఈ మ్యాచ్ ఎలాంటి సవాలో అర్థమవుతుంది. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన రోహిత్‌కు హ్యాట్సాఫ్. అతడి ఇన్నింగ్స్ చాలా ప్రత్యేకం' అని కోహ్లీ తెలిపాడు.
నేనింతవరకు చూడలేదు:
'పిచ్ పరిస్థితులు బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్నాయి. మేం టాస్ గెలిస్తే మొదట బౌలింగే చేసేవాళ్లం. మొదటి 15 ఓవర్లు మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా బుమ్రా బంతులలో వైవిద్యం చూపించాడు. అతడి బౌలింగ్ బ్యాట్స్‌మన్‌పై ఒత్తిడి పెంచింది. బుమ్రా బౌలింగ్‌లో డికాక్ క్యాచ్ అందుకున్న 15 నిమిషాల తర్వాత కూడా నా చేతులు సాధారణ స్థితికి రాలేదు. ఆ బంతికి ఆమ్లా ఔట్ అవ్వడం వన్డేల్లో నేనింతవరకు చూడలేదు. దీన్నిబట్టి బుమ్రా ప్రత్యేక ఏంటో చెప్పొచ్చు' అని కోహ్లీ పేర్కొన్నారు.

విజయం ఎంతో ప్రత్యేకం:
బ్యాటింగ్‌లోనూ అందరూ రోహిత్‌కు అండగా నిలబడ్డారు. జట్టులో అనుభవం గల బ్యాట్స్‌మన్‌లు ఉన్నారు. టాప్ ముగ్గురిలో సెంచరీ వస్తే గెలుపు సులువే. రోహిత్‌తో కలిసి రాహుల్ అద్భుతంగా బ్యాటింగ్ చేసాడు. ధోనీ కీలక ఇనింగ్స్ ఆడాడు. పాండ్యా మంచి ఫినిష్ ఇచ్చాడు. జట్టుగా రాణించాం. మేం ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. జట్టుగా పటిష్టంగా ఉన్నాం. మొదటి విజయం ఎంతో ప్రత్యేకం. మరిన్ని విజయాలపై దృష్టి పెట్టాం' అని కోహ్లీ చెప్పుకొచ్చారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications