Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రోహిత్ సెంచరీ.. విరాట్ సరసన రోహిత్

CWC19, India vs Pakistan: Rohit Sharma 2nd Indian after Virat Kohli to hit World Cup hundred againest Pakistan

ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ సెంచరీ సాధించాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి పాక్‌ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో ఇన్నింగ్‌ 30 ఓవర్‌లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. పాక్‌ బౌలర్‌ షెహదాబ్‌ ఖాన్‌ వేసిన 30 ఓవర్‌ చివరి బంతికి సింగిల్‌ తీసి రోహిత్‌ 100 ( 85 బంతుల్లో 9×4, 3×6) సెంచరీ పూర్తి చేశాడు. అర్థ శతకం సాధించడానికి 34 బంతులు మాత్రమే ఆడిన రోహిత్‌.. సెంచరీ చేయడానికి 51 బంతులు తీసుకున్నాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

రెండో సెంచరీ:

ఇది రోహిత్‌కు వన్డే కెరీర్‌లో 24వ సెంచరీ. ఈ ప్రపంచకప్‌లో రెండో సెంచరీ. టోర్నీ ఆరంభంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ తొలి సెంచరీ అందుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేశాడు. కాగా తాజా సెంచరీ రోహిత్‌కు ఓవరాల్‌ ప్రపంచకప్‌లో మూడో సెంచరీ. ఇక ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై రెండో సెంచరీ. దీంతో ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై రెండు సెంచరీలు సాధించిన రెండో భారత ఆటగాడిగా రోహిత్‌ గుర్తింపు సాధించాడు. గతంలో పాక్‌పై విరాట్‌ కోహ్లీ రెండు సెంచరీలు సాధించాడు. 2015లో కోహ్లీ ఈ ఘనత నెలకొల్పాడు.

203 ఇన్నింగ్‌లలోనే 24 సెంచరీలు:

203 ఇన్నింగ్‌లలోనే 24 సెంచరీలు:

ఇక 203 ఇన్నింగ్‌లలోనే రోహిత్ 24 సెంచరీలు అందుకున్నాడు. దీంతో అతి తక్కువ ఇన్నింగ్‌లలో 24 శతకాలు అందుకున్న నాలుగో బ్యాట్స్‌మెన్‌గా రోహిత్‌ రికార్డుల్లోకి ఎక్కాడు. హాషీమ్‌ ఆమ్లా (142 ఇన్నింగ్‌లు), విరాట్‌ కోహ్లీ (161 ఇన్నింగ్‌లు), ఏబీ డివిలియర్స్‌ (192 ఇన్నింగ్‌లు) రోహిత్ కంటే ముందు ఉన్నారు.

టీమిండియా సరికొత్త రికార్డు:

టీమిండియా సరికొత్త రికార్డు:

ఈ మ్యాచ్‌లో టీమిండియా సరికొత్త రికార్డు నెలకొల్పింది. ప్రపంచకప్‌ చరిత్రలో పాకిస్తాన్‌పై అత్యధిక ఓపెనింగ్‌ పరుగుల భాగస్వామ్యాన్ని భారత్‌ సాధించింది. భారత ఓపెనర్లు రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌లు వంద పరుగుల భాగస్వామ్యాన్ని సాధించి సరికొత్త రికార్డును నెలకొల్పారు. గతంలో పాక్‌పై భారత్‌ అత్యధిక ఓపెనింగ్‌ భాగస్వామ్యం 90. అయితే ఈ మ్యాచులో రోహిత్ 140 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

1
43665

{headtohead_cricket_3_5}

Story first published: Sunday, June 16, 2019, 18:04 [IST]
Other articles published on Jun 16, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+