For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రోహిత్ శర్మ సెంచరీ.. భారీ స్కోరు దిశగా భారత్

ICC Cricket World Cup 2019: IND v PAK | Rohit Sharma Makes 2nd Century In World Cup 2019
CWC19, India vs Pakistan: Openar Rohit Sharma ton helps IND dominate Pakistan

ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ దూకుడుగా ఆడుతున్నాడు. ఇన్నింగ్స్ మొదటి నుండి బౌండరీల వర్షం కురిపిస్తూ 34 బంతుల్లో (6 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్‌ సెంచరీ సాధించిన రోహిత్.. అనంతరం మరింత దూకుడుగా ఆడి 85 బంతుల్లోనే (9 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీ సాధించాడు. ఇది ఈ ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ రెండో సెంచరీ. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో 122 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఓవరాల్‌గా రోహిత్ శర్మకు 24వది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియాకు లోకేశ్ రాహుల్, రోహిత్ శర్మలు మంచి శుభారంభం ఇచ్చారు. ఇద్దరూ కలిసి వేగంగా పరుగులు చేస్తూ హాఫ్ సెంచరీలు చేశారు. అయితే 136 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యాన్ని పాక్ బౌలర్ రియాజ్ విడగొట్టాడు. 57 పరుగులు చేసిన రాహుల్ రియాజ్ బౌలింగ్‌లో బాబర్ ఆజంకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

అయితే క్రీజులో కుదురుకున్నరోహిత్ బ్యాట్ ఝళిపిస్తున్నాడు. అతనికి కెప్టెన్ కోహ్లీ మంచి సహకారం అందిస్తున్నాడు. ఈ జోడి పరుగులు చేయడంతో భారత్ భారీ స్కోరు దిశగా దూసుకెళుతోంది. ప్రస్తుతం 33 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 191 పరుగులు చేసింది. రోహిత్ (107), కోహ్లీ (22)లు క్రీజులో ఉన్నారు.

ఈ మ్యాచ్‌లో టీమిండియా సరికొత్త రికార్డు నెలకొల్పింది. ప్రపంచకప్‌ చరిత్రలో పాకిస్తాన్‌పై అత్యధిక ఓపెనింగ్‌ పరుగుల భాగస్వామ్యాన్ని భారత్‌ సాధించింది. భారత ఓపెనర్లు రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌లు వంద పరుగుల భాగస్వామ్యాన్ని సాధించి సరికొత్త రికార్డును నెలకొల్పారు. గతంలో పాక్‌పై భారత్‌ అత్యధిక ఓపెనింగ్‌ భాగస్వామ్యం 90.

1
43665

{headtohead_cricket_3_5}

Story first published: Sunday, June 16, 2019, 17:32 [IST]
Other articles published on Jun 16, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+