
ప్రపంచకప్‌లో భాగంగా ఓల్డ్ ట్రెఫోర్డ్ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత ఓపెనర్లు నిలకడగా ఆడుతున్నారు. రెగ్యులర్ ఓపెనర్ శిఖర్ ధావన్ స్థానంలో వచ్చిన కేఎల్ రాహుల్ ఆచితూచి ఆడుతున్నా.. మరో ఓపెనర్ 'హిట్ మ్యాన్' రోహిత్ శర్మ సిక్సులు, ఫోర్లతో చెలరేగుతున్నాడు. షాదాబ్ ఖాన్ వేసిన 12వ ఓవర్ చివరి రెండు బంతులను సిక్స్, ఫోర్ బాది హాఫ్ సెంచరీ చేసాడు. కేవలం 35 బంతుల్లో 6 ఫోర్లు, రెండు సిక్సర్లతో హాఫ్ సెంచరీ అందుకున్నాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
అంతకుముందు 10వ ఓవర్‌లో రోహిత్ రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. రియాజ్ వేసిన బంతిని రాహుల్ మిడ్‌వికెట్ దిశగా షాట్ ఆడాడు. తొలి పరుగు పూర్తి చేసిన తర్వాత రోహిత్ రెండో పరుగు తీసేందుకు సగం పిచ్ వరకు వెళ్లగా.. బౌలింగ్ ఎండ్‌లో ఉన్న రాహుల్ పరుగు తీసేందుకు నిరాకరించాడు. దీంతో రోహిత్ తిరిగి వెనక్కి వెళ్లాడు. అయితే బంతిని అందుకున్న ఫకార్ జమాన్ బౌలింగ్ ఎండ్‌వైపు త్రో వేశాడు. దీంతో రోహిత్ మళ్లీ కీపింగ్ ఎండ్‌వైపు పరుగు తీశాడు.
పిచ్ పేసర్లకు అనుకూలిస్తుండటంతో మనోళ్లు ఆచితూచి ఆడుతున్నారు. రోహిత్ హాఫ్ సెంచరీ అనంతరం కొంచెం దూకుడు తగ్గించాడు. కేవలం సింగిల్స్ తీస్తూ స్కోరు బోర్డును ముందుకు నడుపుతున్నాడు. ప్రస్తుతం భారత్ 16 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా భారత్ 93 పరుగులు చేసింది. రోహిత్ (58), రాహుల్ (33) క్రీజులో ఉన్నారు.
{headtohead_cricket_3_5}